te_tw/bible/kt/divine.md

2.6 KiB

దైవికమైన

నిర్వచనం:

"దైవికమైన" అనే పదం దేవునికి చెందిన దేనికైనా వర్తిస్తుంది.

  • ఈ పదాన్ని ఉపయోగించే పద్ధతులలో "దైవికమైన అధికారం," "దైవికమైన తీర్పు," "దైవికమైన స్వభావం," "దైవికమైన శక్తి,” “దైవికమైన మహిమ" అని ఇందావచ్చు.
  • బైబిలులో ఒక వాక్య భాగంలో, అబద్ద దేవునికి చెందిన దానిని వర్ణించడానికి "దైవికమైన" అనే పదం ఉపయోగించబడింది.

అనువాదం సూచనలు:

  • "దైవికమైన" అనే పదాన్ని అనువదించడంలో "దేవుని” లేదా “దేవుని నుండి” లేదా “దేవునికి సంబంధించిన” లేదా “దేవుని గుణ లక్షణాలు" అనే పద్దతులు ఉంటాయి.
  • ఉదాహరణకు, "దైవికమైన అధికారం" అనే దానిని "దేవుని అధికారం” లేదా “దేవుని నుండి కలిగిన అధికారం" అని అనువదించవచ్చు.
  • "దైవికమైన మహిమ" అనే పదాన్ని "దేవుని మహిమ” లేదా “దేవునికి గల మహిమ” లేదా “దేవుని నుండి వచ్చే మహిమ" అని అనువదించవచ్చు.
  • కొన్ని అనువాదాలు అబద్ధ దేవుళ్ళ విషయంలో వివరించే సమయంలో భిన్నమైన పదాన్ని వినియోగించవచ్చు.

(చూడండి: అధికారం, అబద్ధ దేవుడు, మహిమ, దేవుడు,, న్యాయాధిపతి, శక్తి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G23040, G29990