te_tw/bible/kt/disciple.md

5.6 KiB
Raw Permalink Blame History

శిష్యుడు, శిష్యులు

నిర్వచనం:

"శిష్యుడు" అంటే ఒక బోధకునితో ఎక్కువ సమయం గడుపుతూ అతని నుండి అతని గుణ లక్షణాలు, బోధ నేర్చుకుంటూ ఉండే వాడు.

  • యేసుతో వెళ్తూ అయన బోధలు వింటూ ఆయనకు లోబడుతూ ఉండే వారిని "శిష్యులు" అన్నారు.
  • బాప్తిసమిచ్చే యోహానుకు కూడా శిష్యులు ఉన్నారు.
  • యేసు పరిచర్య కాలంలో అనేక మంది శిష్యులు ఆయన్ని వెంబడించి అయన బోధలు విన్నారు.
  • యేసు ఎన్నుకొన్న పన్నెండు మంది శిష్యులు ఆయనకు అత్యంత సన్నిహితమైన అనుచరులు; ఈ మనుషులకు "అపోస్తలులు" అని పేరు వచ్చింది.
  • యేసు పన్నెండు అపోస్తలులను "శిష్యులు” లేక “పన్నెండు మంది" అని పిలిచే వారు.
  • యేసు పరలోకానికి వెళ్లకముందు అయన తన శిష్యులు ఇతరులకు బోధించాలని, వారిని యేసు శిష్యులుగా చెయ్యాలని అజ్ఞాపించాడు.
  • ఎవరైనా యేసుపై విశ్వాసం ఉంచి అయన బోధలకు లోబడితే అలాటి వారిని యేసు శిష్యుడు అని పిలవ వచ్చు.

అనువాదం సలహాలు:

  • "శిష్యుడు" అనే దాన్ని ఒక పదంతో లేక పదబంధంతో అనువదించ వచ్చు. "అనుచరుడు” లేక “విద్యార్థి” లేక “ఛాత్రుడు” లేక “నేర్చుకునే వాడు."
  • ఈ పదం అనువాదం ఒక తరగతి గదిలో కూర్చుని ఉండే విద్యార్థి అనే అర్థం రాకుండా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ పదం అనువాదం "అపోస్తలుడు" అనే మాటకు కూడా వేరుగా ఉండేలా చూడండి.

(చూడండి:apostle, believe, Jesus, John (the Baptist), the twelve)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 30:08 అయన (యేసు) ఆ ముక్కలను తన శిష్యులకు ఇచ్చి ప్రజలకు పంచమన్నాడు. శిష్యులు ఆ ఆహారం, పంచి పెట్టిన కొలది అది అయిపోవడం లేదు!
  • 38:01 దాదాపు మూడు సంవత్సరాల తరువాత యేసు మొదటిగా బహిరంగ బోధ ప్రకటించడం మొదలు పెట్టి తన శిష్యులతో తాను చనిపోవడానికి ముందు యెరూషలేములో వారితో కలిసి పస్కా అచరించాలని కోరాడు.
  • 38:11 తరువాత యేసు తన శిష్యులతో కలిసి గేత్సేమనే అనే చోటికి వెళ్ళాడు. యేసు తన శిష్యులతో వారు శోధనలోకి ప్రవేశింసించకుండేలా ప్రార్థించమని చెప్పాడు.
  • 42:10 యేసు తన శిష్యులతో, "సర్వాధికారం పరలోకంలోను, భూమిమీదా నాకు ఇవ్వ బడింది” అని చెప్పాడు. కాబట్టి వెళ్లి ప్రజలు సమూహాలను శిష్యులుగా చెయ్యండి. వారికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల నామంలో బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ వారు లోబడాలని వారికి నేర్పించండి" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs: H3928, G31000, G31010, G31020