te_tw/bible/other/wolf.md

3.3 KiB

తోడేలు, తోడేళ్ళు, అడవి కుక్కలు

నిర్వచనము:

తోడేలు చాలా క్రూరమైన జంతువు, అడవి కుక్కకు సమానముగా ఉండే మాంసాహారి ప్రాణి.

  • తోడేళ్ళు సాధారణముగా సమూహాలుగాను మరియు కొమ్మల మధ్యన ఉండి వేటాడుతాయి, వాటి వేట చాలా దొంగ తెలివితేటలతో ఉంటుంది.
  • పరిశుద్ధ గ్రంథములో “తోడేళ్ళు” అనే మాటను గొర్రెలకు పోల్చబడిన విశ్వాసులను నాశనము చేసే అబద్ద ప్రవక్తలను లేక అబద్ద బోధకులను సూచించుటకు అలంకారికముగా ఉపయోగించబడింది. అబద్ద బోధ ప్రజలు తప్పుడు విషయాలను నమ్మునట్లు చేయును మరియు వారికి హానిని తీసుకొని వచ్చును.
  • గొర్రెలు విశేషముగా తోడేళ్ళ ద్వారా దాడి చేయబడి, వాటికి ఆహారముగా మారుతాయనే సత్యాంశము ఆధారముగా ఈ పోలిక చేయబడినది, ఎందుకంటే అవి బలహీనముగా ఉంటాయి మరియు వాటిని అవి రక్షించుకొనలేవు.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును “అడవి కుక్క” లేక “అడవి ప్రాణి” అని కూడా తర్జుమా చేయుదురు.
  • అడవి కుక్కలకు ఇతర పేర్లు “జాకాల్” లేక “కోయోతే” అని కూడా ఉన్నాయి.
  • ప్రజలను సూచించుటకు అలంకారికముగా ఉపయోగించినప్పుడు, దీనిని “గొర్రెల మీద దాడికి వెళ్ళే ప్రాణులవలె ప్రజలకు హానికలిగించే దుష్ట ప్రజలు” అని తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: చెడు, తప్పుడు ప్రవక్త, గొర్రె, బోధించు)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2061, H3611, G3074