te_tw/bible/other/teach.md

3.7 KiB

బోధించు, బోధిస్తున్న, బోధించారు, బోధ, బోధలు

నిర్వచనం:

ఒకరికి "బోధించడం" అంటే అతనికి ఇంతకు ముందు తెలియని దానిని చెప్పడం. సాధాణంగా నేర్చుకొంటున్న వ్యక్తిని సూచించకుండా "సమాచారాన్ని అందించడం" అని అర్థాన్ని కూడా ఇస్తుంది. సహజంగా సమాచారం క్రమబద్ధమైన లేదా పద్ధతి ప్రకారం అందించబడుతుంది. ఒక వ్యక్తి "బోధ" లేదా అతని "బోధలు" అంటే అతడు బోధించిన విషయాలు.

  • "బోధకుడు" అంటే బోధించే వ్యక్తి. "బోధించు" అనే దాని భూతకాల రూపం "బోధించారు."
  • యేసు బోధిస్తున్నప్పుడు ఆయన దేవుని గురించీ, ఆయన రాజ్యం గురించిన విషయాలు ఆయన వివరిస్తున్నాడు. .
  • యేసుశిష్యులు ఆయన్ను "బోధకుడు" అని పిలిచారు. దేవుని గురించి ప్రజలకు బోధించే వారిని సూచించే గౌరవ పూర్వకమైన పిలుపు ఇది.
  • బోధించబడిన సమాచారం చూపించబడవచ్చు లేదా పలుకబడవచ్చు.
  • "సిద్దాంతం" పదం దేవుని గురించి దేవుని నుండి వచ్చే ఉపదేశాలనూ, ఏవిధంగా జీవించాలనే దేవుని హెచ్చరికలనూ సూచిస్తున్నాయి. "దేవుని నుండి ఉపదేశాలు" అని అనువదించబడవచ్చు.
  • "నీవు బోధించబడిన సంగతులు" పదబంధం "ఈ ప్రజలు నీకు బోధించిన సంగతులు" లేదా "దేవుడు నీకు బోధించిన సంగతులు" అని సందర్భాన్ని బట్టి అనువదించబడవచ్చు.
  • "బోధించు" పదం "చెప్పు" లేదా "వివరించు" లేదా "హెచ్చరించు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • తరచుగా ఈ పదం "దేవుని గురించి ప్రజలకు బోధించడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: ఉపదేశించు, బోధకుడు, దేవుని వాక్కు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H502, H2094, H2449, H3045, H3046, H3256, H3384, H3925, H3948, H7919, H8150, G1317, G1321, G1322, G2085, G2605, G2727, G3100, G2312, G2567, G3811, G4994