4.2 KiB
4.2 KiB
బోధకుడు , ఉపదేశకులు, బోధకుడు
నిర్వచనం:
బోధకుడు అంటే ఇతరులకు కొత్తసమాచారం అందించే వ్యక్తి. ఉపదేశకులు ఇతరులు పరిజ్ఞానం, నిపుణతలు నేర్చుకునేలా సహాయం చేస్తారు.
- బైబిల్లో "బోధకుడు " అనే మాటను ప్రత్యేక రీతిలో ఉపయోగిస్తారు. దేవుణ్ణి గురించి బోధించే ఎవరినైనా సూచించడానికి ఈ పదం వాడతారు.
- బోధకుల నుండి నేర్చుకునే వారిని "విద్యార్థులు” లేక “శిష్యులు" అంటారు.
- కొన్నిబైబిల్ అనువాదాల్లో ఈ పదాన్ని యేసుకు ప్రత్యేక బిరుదు నామంగా ఉపయోగిస్తారు.
అనువాదం సలహాలు:
- బోధకుడు అనేది సాధారణంగా దీన్ని మత ఉపదేశకుల సంబోధనను అనువదించడంలో ఉపయోగిస్తారు. పాఠశాల అధ్యాపకులకు ఇది వాడరు.
- కొన్నిసంస్కృతుల్లో దీన్ని ప్రత్యేక బిరుదు నామంగా, ఉదాహరణకు "అయ్యా” లేక “రబ్బీ” లేక “ఉపదేశకా" అని వాడతారు.
బైబిల్ రిఫరెన్సులు:
- ప్రసంగి 01:12-15
- ఎఫెసి 04:11-13
- గలతి 06:6-8
- హబక్కూకు 02:18-20
- యాకోబు 03:1-2
- యోహాను 01:37-39
- లూకా 06:39-40
- మత్తయి 12:38-40
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 27:01 ఒక రోజు , యూదు చట్టం నిపుణుడు యేసును పరీక్ష చేస్తూ ఇలా అన్నాడు, "బోధకా, నిత్య జీవం వారసత్వముగా పొందడానికి నేనేం చెయ్యాలి?"
- 28:01 ఒక రోజు ఒక ధనిక యువ అధికారి యేసును ఇలా అడిగాడు, "మంచి బోధకా, నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలి?"
- 37:02 రెండురోజులు గడిచాక, యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, "మనం తిరిగి యూదయకు వెళ్దాం పదండి." అయితే శిష్యులు ఇలా జవాబిచ్చాడు, " బోధకా, కొద్ది రోజుల క్రితమే వారు నిన్ను చంపడానికి చూశారు కదా!"
- 38:14 యూదా వచ్చి యేసు దగ్గరికి వచ్చి "బోధకా, వందనాలు" అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు.
- 49:03 యేసు గొప్ప బోధకుడు, ఆయన అధికారంతో మాట్లాడాడు. ఎందుకంటే అయన దేవుని కుమారుడు.
పదం సమాచారం:
- Strong's: H3384, H3887, H3925, G1320, G2567, G3547, G5572