te_tw/bible/other/sheep.md

5.2 KiB

ఆడగొర్రె, ఆడగొర్రెలు, పొట్టేలు, పొట్టేళ్ళు, గొర్రెలు, గొర్రెల దొడ్డి, గొర్రెల దొడ్లు, గొర్రెల కాపర్లు, గొర్రెల చర్మములు

నిర్వచనము:

“గొర్రె” అనగా ఉన్ని దేహమును కలిగిన నాలుగు కాళ్ల ఒక చిన్న ప్రాణియైయుండును. మగ గొర్రెను “పొట్టేలు” అని పిలిచెదరు. పొట్టేళ్ళు కాని ప్రతి గొర్రెను “ఆడగొర్రె” అని పిలిచెదరు. “గొర్రె” అనే పదానికి బహువచనము “గొర్రెలు” పిలిచెదరు.

  • గొర్రెకు పుట్టిన పిల్లను “గొర్రె పిల్ల” పిలిచెదరు.
  • ఇశ్రాయేలీయులు అనేకమార్లు బలులను అర్పించుటకు గొర్రెలను ఉపయోగించుదురు, విశేషముగా పొట్టేళ్లను మరియు క్రోవ్విన గొర్రెలను అర్పించుదురు.
  • ప్రజలు గొర్రె మాంసము తిందురు మరియు వాటి ఉన్నిని బట్టలు తయారు చేయడానికి, ఇతర వస్తువులు చేయడానికి ఉపయోగించుదురు.
  • గొర్రెలు చాలా నమ్మదగినవి, బలహీనమైనవి మరియు దుర్బలమైనవి. అవి చాలా సులభముగా దారి తప్పి ప్రక్కకు వెళ్లిపోతాయి. వాటిని సరియైన విధముగా నడిపించుటకు, సంరక్షించుటకు, మరియు వాటికి ఆహారము, నీరు, దొడ్డిని అందించుటకు వాటికి కాపరి అవసరము.
  • పరిశుద్ధ గ్రంథములో ప్రజలు గొర్రెలకు, దేవుడు కాపరికి పోల్చడము జరిగింది.

(తర్జుమా సలహాలు: తెలియని వాటిని ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు, గొర్రెపిల్ల, బలియాగం, కాపరి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 09:12 ఒక రోజున మోషే తన గొర్రెలను మేపుచున్నప్పుడు, అతను మండుచున్న ఒక పొదను చూచెను.
  • 17:02 దావీదు బెత్లెహేము పట్టణమునుండి వచ్చిన కాపరియైయుండెను. వేరు వేరు సమయాలలో అతను తన తండ్రి గొర్రెలను కాయుచుండెను, దావీదు గొర్రెల మీదకి దాడి చేయవచ్చిన సింహమును మరియు ఎలుగుబంటిని చంపివేసెను.
  • 30:03 వీరందరూ కాపరిలేని గొర్రెలవలే ఉన్నారని యేసు చెప్పెను.
  • 38:08 “ఈ రోజు రాత్రి మీరందరూ నన్ను పరిత్యజిస్తారు అని యేసు చెప్పెను. “నేను కాపరిని కొట్టుదును మరియు సమస్త గొర్రెలన్నియు చెదరిపోవును” అని వ్రాయబడియున్నది.”

పదం సమాచారం:

  • Strong's: H352, H1494, H1798, H2169, H3104, H3532, H3535, H3733, H3775, H5739, H5763, H6260, H6629, H6792, H7353, H7462, H7716, G4165, G4262, G4263