te_tw/bible/other/wheat.md

2.7 KiB

గోధుమ

నిర్వచనము:

గోధుమ అనునది ప్రజలు ఆహారము కొరకు పండించుకునే ఒక రకమైన ధాన్యము. బైబిలు “ధాన్యము” లేక “విత్తనములు” అని ప్రస్తావించినప్పుడు, గోధుమ ధాన్యము లేక విత్తనములను గూర్చి మాట్లాడుతుందని దాని అర్థము.

  • గోధుమ గింజలు లేక ధాన్యములు గోధుమ చెట్టుపై చివరి భాగమున పండుతుంది.
  • గోధుమ పంటను కోసిన తరువాత, గోధుమ సొప్పను నలగద్రోక్కించిన తరువాత ఆ సొప్పనుండి ధాన్యమును వేరు చేస్తారు. గోధుమ చెట్టుయొక్క సొప్పను “గడ్డి” అని కూడా పిలుస్తారు మరియు దీనిని ప్రాణులు పడుకోవడానికి వాటి క్రింది వేసేందుకు ఉపయోగిస్తారు.
  • నలగగొట్టినతరువాత, ధాన్యపు విత్తనపు చుట్టూ ఉన్నటువంటి పొట్టును తూర్పారబెట్టుట ద్వారా వేరు చేస్తారు.
  • ప్రజలు ఆ గోధుమను పిండిగా చేసుకుంటారు, దీనిని రొట్టెను చేయుటకు ఉపయోగించుకుంటారు.

(ఈ పదాలను కూడా చూడండి: యవలు, పొట్టు, ధాన్యము, విత్తనము, దంచుట, తూర్పారబెట్టుట)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1250, H2406, G4621