te_tw/bible/other/stumble.md

3.9 KiB

పడిపో, జారిపడుట, పడిపోయెను, పడిపోవుట

నిర్వచనము:

“పడిపో” అనే ఈ పదమునకు నడిచి వెళ్ళేటప్పుడు లేక పరుగెత్తేటప్పుడు “దాదాపు క్రిందకి పడిపోవుట” అని అర్థము. సాధారణముగా ఇది ఏదైనా ఒకదాని మీద తట్టుకొని పడుట అని అర్థమిచ్చును.

  • అలంకారికముగా, “పడిపో” అనే ఈ పదానికి “పాపము చేయు” లేక నమ్ముటలో “తప్పు చేయుట” అని అర్థము.
  • యుద్ధము చేయునప్పుడు లేక హింసించబడుచున్నప్పుడు లేక శిక్షించబడుచున్నప్పుడు తొట్రుపడుటను లేక బలహీనతను చూపించుటకు కూడా ఈ పదమును ఉపయోగించుదురు.

తర్జుమా సలహాలు:

  • భౌతికముగా ఒకదాని మీద జారిపడినప్పుడు “పడిపో” అనే పదమును ఉపయోగించే సందర్భాలలో దీనిని “దాదాపు పడిపోయినట్లుగాను” లేక “జారిపడినట్లుగాను” అర్థమునిచ్చే మాటలతో తర్జుమా చేయాలి.
  • సందర్భములో సరియైన అర్థమును ఇచ్చినట్లయితే, ఈ పదానికున్న అక్షరార్థ అర్థము అలంకార సందర్భములో కూడా ఉపయోగించబడుతుంది.
  • అనువాద భాషలో అక్షరార్థము ఇవ్వని అలంకారిక ఉపయోగాలలో, “పడిపో” అనే పదమును “పాపము చేయు” లేక “తప్పు చేయు” లేక “నమ్ముటను ఆపు” లేక “బలహీనపడు” అని అనేక మాటలను సందర్భానుసారముగా తర్జుమా చేయవచ్చు.
  • ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములో “పాపము చేయుట ద్వారా పడిపోవుట” లేక “నమ్మకుండుట ద్వారా జారిపడుట” అనే మాటలను వినియోగించుదురు.
  • “పడిపోవునట్లు చేసెను” అనే మాటను “బలహీనమగుటకు కారణమాయెను” లేక “తప్పు చేయుటకు కారణమాయెను” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: నమ్ము, హింసించు, పాపము చేయు, అడ్డంకు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1762, H3782, H4383, H4384, H5062, H5063, H5307, H6328, H6761, H8058, G679, G4348, G4350, G4417, G4624, G4625