te_tw/bible/other/stumblingblock.md

3.1 KiB

అడ్డంకు, అడ్డంకులు, అడ్డు రాయి

నిర్వచనము:

“అడ్డంకు” లేక “అడ్డగించు రాయి” అనే పదములు ఒక వ్యక్తి జారిపడేందుకు మరియు క్రింద పడేందుకు కారణమయ్యే ఒక వస్తువును సూచిస్తుంది.

  • అలంకారిక అడ్డంకు అనేది ఒక వ్యక్తి ఆత్మీయకముగాను లేక నైతికముగాను పడిపోవునట్లు చేసే ఏదైనా కారణమును సూచిస్తుంది.
  • అలంకారికముగా కూడా, “అడ్డంకు” లేక “అడ్డగించు రాయి” అనే మాటకు ఒక వ్యక్తి యేసునందు విశ్వాసముంచుటనుండి అడ్డగించుట లేక ఒక వ్యక్తి ఆత్మీయకముగా ఎదగకుండా చేయుట అని అర్థము కలదు.
  • అనేకమార్లు ఒక వ్యక్తికి లేక ఇతరులకు అడ్డంకుగా ఉండేటువంటి పాపము అని కూడా చెప్పవచ్చు.
  • కొన్నిసార్లు దేవుడు తనకు విరుద్ధముగా నడుచుకొనే వారి జీవితములో అడ్డంకును పెడతాడు.

తర్జుమా సలహాలు:

  • జారిపడేటట్లు చేసే ఒక వస్తువు కొరకు మీ భాషలో పదమున్నట్లయితే, ఆ పదమును కూడా ఇక్కడ తర్జుమా చేసి ఉపయోగించుకొనవచ్చు.
  • ఈ పదమును “అడ్డగించే రాయి” లేక “ఎవరైనా దేనినైనా నమ్మకుండా చేసేది” అని లేక “సందేహమును కలిగించే అభ్యంతరము” అని లేక “విశ్వాసమునకు అడ్డుబండ” అని లేక “ఎవరైనా పాపము చేయుటకు ఆస్కారమయ్యే విషయము” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: పడిపో, పాపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4383, G3037, G4349, G4625