te_tw/bible/other/shield.md

2.9 KiB

డాలు, డాళ్ళు, డాలు చేపట్టబడెను

నిర్వచనము:

డాలు అనేది సైనికుడు యుద్ధములో తనను తాను శత్రువల ఆయుధమునుండి గాయపడకుండ సంరక్షించుకొనుటకు ఉపయోగించే వస్తువైయున్నది. ఒకరికి “డాలు” ఇచ్చుట అనగా హానినుండి ఆ వ్యక్తిని సంరక్షించుట అని అర్థము.

  • డాళ్ళు ఎక్కువ మట్టుకు వృత్తాకారములో లేక అండాకారంలో ఉండేవి, వాటిని చర్మము, చెక్క, లేక లేక లోహమువంటివాటితో తయారు చేసేవారు. వాటిని చిల్చే వాటినుండి అనగా బాణము లేక ఖడ్గము అనేవాటినుండి కాపాడుటకు అవి దృఢమైనవిగా, గట్టిగా తయారు చేయుదురు.
  • ఈ పదమును రూపకలంకారముగా ఉపయోగించుటలో, పరిశుద్ధ గ్రంథము దేవునిని తన ప్రజలను కాపాడే సంరక్షణ డాలు అని పిలుచుచున్నది. (చూడండి: రూపకలంకారము)
  • పౌలు “విశ్వాసపు డాలును” గూర్చి మాట్లాడెను, యేసునందు విశ్వాసము కలిగియుండుటను గూర్చి చెప్పే అలంకారిక విధానమైయున్నది మరియు దేవునికి విధేయత చూపుటలో విశ్వాసము ద్వారా జీవించునప్పుడు సాతాను ఆత్మీయ బాణములనుండి విశ్వాసులను సంరక్షించును.

(ఈ పదములను కూడా చూడండి: విశ్వాసము, విధేయత, సాతాను, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2653, H3591, H4043, H5437, H5526, H6793, H7982, G2375