te_tw/bible/other/shame.md

7.7 KiB

సిగ్గు, సిగ్గుపడిన, అవమానం, అగౌరవించు, దూషణ

నిర్వచనం:

“సిగ్గు" పదం ఒక వ్యక్తి అగౌరవకరమైన లేదా సరికాని పని చేసినప్పుడు ఆ వ్యక్తి అవమానింపబడినట్లుగానూ లేదా తక్కువ చేయబడినట్లుగానూ భావించే భాధాకర భావనను సూచిస్తుంది.

  • “సిగ్గుకరమైనది" అంటే "అక్రమమైనది" లేదా "అగౌరవమైనది" అని అర్థం.
  • “సిగ్గుపడుట” అనే పదం ఒక వ్యక్తి అక్రమమైన లేదా అగౌరవమైన పనిని చేసినప్పుడు ఏవిధంగా భావిస్తాడో దానిని వివరిస్తుంది.
  • “అగౌరవపరచు" అంటే సాధారణంగా బహిరంగంగా సిగ్గుపడేలా లేదా అవమానపడేలా చెయ్యడం అని అర్థం. ఒకరిని సిగ్గుపరచే చర్యను "అగౌరవ పరచడం" అంటారు.
  • ఒకరిని "దూషణ" చెయ్యడం అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా ప్రవర్తనను విమర్శించడం లేదా అంగీకరించకపోవడం అని అర్థం.
  • "సిగ్గుపరచడం" అంటే ప్రజలను ఓడించడం లేదా వారు తమ గురించి తాము సిగ్గుపడేలా వారి చర్యలను బహిరంగం చెయ్యడం అని అర్థం. విగ్రహాలను పూజించే వారు సిగ్గుపరచబడతారు అని ప్రవక్త యెషయా చెప్పాడు.
  • "అవమానకరమైన" పదం ఒక పాపకార్యాన్ని వివరించడానికి లేదా ఆ కార్యాన్ని చేసిన వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాప కార్యాన్ని చేసినప్పుడు అది అతనిని అవమాన లేదా అగౌరవ స్థితిలో ఉంచుతుంది.
  • కొన్నిసార్లు మంచి పనులు చేసేవ్యక్తి అవమానం లేదా సిగ్గుపడేలా పరిగణించబడతాడు. ఉదాహరణకు, యేసు సిలువ మీద చంపబడినప్పుడు చనిపోవడంలో ఇది అవమానకరమైన విధానం. ఈ అవమానం పొందడానికి ఆయన ఎలాంటి తప్పూ చెయ్యలేదు.
  • దేవుడు ఒకరిని తక్కువ చేసినప్పుడు అంటే ఒక గర్విష్టియైన వ్యక్తి తన గర్వాన్ని అధిగమించడంలో సహాయం చెయ్యడానికి అతడు ఓటమిని అనుభవించేలా అనుమతించడం అని అర్థం. ఇది ఒక వ్యక్తిని తరచుగా గాయపరచడం కోసం తక్కువచేసే విధానానికి ఇది భిన్నంగా ఉంటుంది.
  • ఒక వ్యక్తి "దూషణకు మించినవాడు" లేదా "దూషణకు దూరంగా ఉన్నవాడు" లేదా "ఎటువంటి దూషణ లేనివాడు" అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి గౌరవించే విధంగా ప్రవర్తిస్తున్నాడు, అతన్ని విమర్శించడానికి చాలా తక్కువ ఉంది లేదా ఏమీ లేదు.

అనువాదం సూచనలు

  • "అవమానం" పదాన్ని "సిగ్గు" లేదా "అగౌరవం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "అవమానకరమైన" పదం అనువాదంలో "సిగ్గుకరమైన" లేదా అగౌరవకరమైన" పదాలు జత చేయబడవచ్చు.
  • "అగౌరవించు (తక్కువచేసి చూపు)" పదం అనువాదంలో "సిగ్గు" లేదా "సిగ్గుపడేలా చేయి" లేదా "ఇబ్బంది పడేలా చేయి" పదాలు జతచెయ్యబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి "అగౌరవించు" పదం "సిగ్గు" లేదా "అగౌరవించు" లేదా "అవమానం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "దూషణ" పదం "నేరారోపణ" లేదా "సిగ్గు" లేదా "అగౌరవం" అని అనువదించబడవచ్చు.
  • "దూషణకు గురిచెయ్యడం" పదం సందర్భాన్ని బట్టి "గద్దించడం" లేదా "నిందించడం" లేదా "విమర్శించడం" అని అనువదించబడవచ్చు.

(ఈ పదములను కూడా చూడండి: హెబెలు, కయీను, పిలిపు, సంతానము, పూర్వీకులు, ప్రళయము, నోవహు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H937, H954, H955, H1317, H1322, H2616, H2659, H2781, H3001, H3637, H3639, H3640, H6172, H7022, H7036, H8103, H8106, G127, G149, G152, G153, G422, G808, G818, G819, G821, G1788, G1791, G1870, G2617, G3856, G5195