te_tw/bible/other/overtake.md

3.8 KiB

లోబరుకొను(అధిగమించు), ఆధీనం చేసుకొను, వశంచేసుకొను, వశంగావించుకోవడం

నిర్వచనం:

“లోబరుచుకొను,” “వశంగావించుకొను” అంటే ఒకరి వ్యక్తిమీదా లేదా ఒక వస్తువు మీద అధికారాన్ని పొందడం అని అర్థం. సాధారణంగా దేనినైనా వెంటాడి దానిని పట్టుకోవడం అనే అభిప్రాయం కూడా ఉంది.

  • ఒక సైన్యదళం వారి శత్రువును ఆధీనం చేసుకొంది అంటే యుద్ధంలో ఆ శత్రువును ఓడించింది అని అర్థం.
  • ఒక జంతువు తనకు ఆహారంగా మరొక జంతువుని వశంచేసుకొన్నది అంటే అది తన ఆహారాన్ని వేటాడి పట్టుకొంది అని అర్థం.
  • ఒక శాపం ఒకరిని “అధిగమించింది” అంటే పలుకబడిన శాపం అంతా ఆ వ్యక్తికి జరిగింది అని అర్థం.
  • ఆశీర్వాదాలు మనుష్యులను “ఆధీనం చేసుకొన్నాయి” అంటే ఈ మనుష్యులు ఆశీర్వాదాలను అనుభవించారు అని అర్థం.
  • సందర్భాన్ని బట్టి, “అధిగమించడం” అనే పదం “జయించడం” లేక “వశంచేసుకోవడం” లేక “ఓడించడం” లేక “పట్టుకోవడం” లేక “పూర్తి ప్రభావాన్ని చూపు” అని అనువదించవచ్చు.
  • జరిగిపోయిన చర్య, “వశంగావించుకోవడం” అనే పదాన్ని “చిక్కించుకోవడం “ లేక “పక్కకు వచ్చింది” లేక “జయించింది” లేక “ఓడించింది” లేక “హాని కలిగించింది” అని అనువదించవచ్చు.
  • మనుష్యుల పాపాన్ని బట్టి చీకటి లేక భయాలు మనుష్యులను పట్టుకొంటాయి అనే హెచ్చరికలో వినియోగించడం, ఆ మనుష్యులు పశ్చాత్తాపపడకపోతే ఈ వ్యతిరేక సంఘటలను అనుభవిస్తారు అని అర్థం.
  • ”నా మాటలు మీ తండ్రులను వశం చేసుకొన్నాయి” అంటే వారి పితరులకు యెహోవా ఇచ్చిన ఉపదేశాలు వారిని శిక్షకు గురి చేశాయి అని అర్థం, ఎందుకంటే ఆ ఉపదేశాలకు వారు లోబడలేదు.

(చూడండి” ఆశీర్వాదం, శాపం, ఆహారం, శిక్షించడం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H579, H935, H1692, H4672, H5066, H5381, G2638, G2983