te_tw/bible/other/punish.md

7.8 KiB

శిక్షించు, శిక్షించును, శిక్షించుట, శిక్షింపబడుట, శిక్ష, శిక్షింపబడని

నిర్వచనము:

“శిక్షించు” అనే ఈ పదమునకు ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినందుకు అనానుకూలమైన పరిణామాలను అనుభవించునట్లు ఒకరిని గురి చేయుట అని అర్థము. “శిక్ష” అనే ఈ పదము చెడు ప్రవర్తనకు ఇచ్చే ఫలితమైన అనానుకూలమైన పరిణామమును సూచిస్తుంది.

  • అనేకమార్లు శిక్ష అనునది ఒక వ్యక్తి పాపము చేయకుండ ఉద్దేశపూర్వకముగా ప్రేరేపించుట అని అర్థమైయున్నది.
  • ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపినప్పుడు ఆయన వారిని శిక్షించాడు, విశేషముగా వారు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించినప్పుడు ఆయన ఎక్కువగా శిక్షించాడు. వారు చేసిన పాపమువలన దేవుడు వారి చెరగొనిపోవుటకు మరియు వారిపైన దాడి చేయుటకు వారి శత్రువులనే వారి మీదకి పంపించాడు.
  • దేవుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడు, అందుచేత ఆయన పాపమును తప్పకుండగా శిక్షిస్తాడు. ప్రతి మానవుడు దేవునికి విరుద్ధముగా పాపము చేశాడు మరియు శిక్షకు పాత్రుడైయ్యాడు.
  • ప్రతి మానవుడు చేసిన ప్రతి దుష్ట కార్యములన్నిటి కొరకు మరియు పాపములన్నిటి కొరకు యేసు శిక్షించబడియున్నాడు. ఆయన ఎటువంటి పాపము చేయకపోయిన మరియు ఆయన ఎటువంటి శిక్షకు పాత్రుడు కాకపోయినా ప్రతి మానవుడు పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసికొనియున్నాడు.
  • “శిక్షను పొందవద్దు” మరియు “శిక్షించవద్దు” అనే మాటలకు ప్రజలు చేసిన తప్పుడు పనులకు వారిని శిక్షించకుండ ఉండాలని దాని అర్థము. ప్రజలు పశ్చాత్తాపము పొందాలని ఎదురుచూస్తున్నప్పుడు వారిని శిక్షించకుండ దేవుడు పాపమునకు అనుమతి ఇస్తూ ఉంటాడు.

(ఈ పదములను కూడా చూడండి: న్యాయము, పశ్చాత్తాపము, నీతి, పాపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:07 దేవుడు కూడా అనుసరించడానికి అనేకమైన ఇతర నియమాలను మరియు కట్టలను ఇచ్చాడు. జనులు ఈ కట్టడలకు విదేయత చూపినట్లయితే, దేవుడు వారిని రక్షించి, ఆశీర్వదిస్తాడని ఆయన వాగ్ధానము చేశాడు. ఒకవేళ వారు ఆయనకు అవిధేయత చూపించినట్లయితే, దేవుడు వారిని శిక్షించును.
  • 16:02 ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపినందున, దేవుడు వారిని ఓడించుటకు తమ శత్రువులకు అనుమతిచ్చుట ద్వారా శిక్షించెను .
  • 19:16 ఇశ్రాయేలీయులు దుష్టత్వమును చేయుట మానక మరియు దేవునికి విధేయత చూపించుట ఆరంభించక ఉన్నందున ప్రవక్తలు వారిని హెచ్చరించిరి, ఆ తరువాత దేవుడు వారిని అపరాదులనుగా తీర్పు తీర్చును మరియు ఆయన వారిని శిక్షించును .
  • 48:06 యేసు పరిపూర్ణుడైన మహా యాజకుడైయుండెను ఎందుకనగా మనుష్యలందరూ చేసిన ప్రతి పాపము కొరకు ఆయన శిక్షను పొందియున్నాడు.
  • 48:10 ఎవరైనా యేసు క్రీస్తునందు నమ్మికయుంచినట్లయితే, యేసు రక్తము ఆ వ్యక్తి పాపమును తీసివేయును, మరియు దేవుని శిక్ష ఆ వ్యక్తినుండి దాటిపోవును.
  • 49:09 అయితే దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చునంతగా ఈ లోకములోని ప్రతియొక్కరిని ఎంతగానో ప్రేమించెను, అందుచేత యేసునందు విశ్వాసముంచిన ప్రతియొక్కరు తమ పాపములను బట్టి శిక్షింపక, వారికి దేవునితో నిత్యమూ ఉండే జీవితమును ప్రసాదించును.
  • 49:11 యేసు పాపము చేయలేదు, అయినా ఆయన శిక్షించబడుటకు , మీ పాపములను మరియు లోకములోని ప్రతియొక్కరి పాపములను తొలగించుటకు ఆయన పరిపూర్ణమైన బలిగా మరణించుటకు ఇష్టపడ్డాడు.

పదం సమాచారం:

  • Strong's: H3027, H3256, H4148, H4941, H5221, H5414, H6031, H6064, H6213, H6485, H7999, H8199, G1349, G1556, G1557, G2849, G3811, G5097