te_tw/bible/other/letter.md

2.4 KiB

పత్రిక, ఉత్తరం, ఉత్తరాలు

నిర్వచనం:

ఉత్తర అంటే సహజంగా రచయితకు దూరంగా ఉన్న వ్యక్తికీ లేక గుంపు ప్రజలకు రాసిన సందేశం. పత్రిక అంటే ప్రత్యేకమైన పద్ధతిలో రాసిన ఉత్తరం. తరుచుగా క్రమబద్ధంగా ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది, ఉపదేశం ఉంటుంది.

  • కొత్తనిబంధన కాలంలో, పత్రికలూ, ఇతర రకాలైన ఉత్తరాలు జంతు చర్మాలతో చేసిన తోలు పత్రాలు, మొక్కలనుండి పీచుతో చేసిన పురాతన పత్రాలలో రాసేవారు.
  • అపోస్తలుడైన పౌలు, యోహాను, యాకోబు, యూదా, పేతురుల రాసిన హెచ్చరికా పూరిత పత్రికలు రోమా సామ్రాజ్యం అంతటిలోనూ ఉన్న వివిధ పట్టణాలలో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహించడానికీ, హెచ్చరించడానికీ, వారికి బోధించడానికి ఉద్దేశించినవి.
  • ఈ పదాన్ని “రాసిన సందేశం” లేక “రాసిన పదాలు” లేక “రాసినది” అని అనువదించవచ్చు.

(చూడండి: ప్రోత్సాహం, హెచ్చరిక, ఉపదేశం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H104, H107, H3791, H4385, H5406, H5407, H5612, H6600, G1121, G1989, G1992