te_tw/bible/other/courage.md

6.2 KiB

ధైర్యం, ధైర్యంగల, ప్రోత్సహించు, ప్రోత్సాహం, నిరుత్సాహపరచు, అధైర్యం

వాస్తవాలు:

"ధైర్యం" పదం కష్టమైనవి, భయపెట్టేవి, లేదా ప్రమాదకరమైనవాటిని నిర్భయంగా ఎదుర్కోవడం లేదా వాటిని చెయ్యడం అని సూచిస్తుంది.

  • "ధైర్యం గల" పదం ధైర్యాన్ని చూపించే వ్యక్తినీ, భయంగా అనిపించినప్పటికీ లేదా విడిచి పెట్టాలనే ఒత్తిడి వచ్చినప్పటికీ సరియైన దానిని చేస్తున్న వ్యక్తినీ వివరిస్తుంది.
  • ఒక వ్యక్తి భావోద్రేకమైన లేదా శారీరకమైన బాధను బలంతోనూ, పట్టుదలతోనూ ఎదుర్కొనేటప్పుడు ధైర్యాన్ని కనుపరుస్తాడు.
  • "ధైర్యంగా ఉండు" అంటే "భయపడవద్దు" లేదా "సంగతులన్నీ సక్రమంగా జరుగుతాయనే నిశ్చయత కలిగియుండు" అని అర్థం.
  • యెహోషువా ప్రమాదకరమైన కనాను ప్రదేశం వెళ్ళడానికి సిద్దపడుతున్నప్పుడు అతడు "బలము కలిగి ధైర్యంగా" ఉండాలని మోషే హెచ్చరిస్తున్నాడు.
  • "ధైర్యంగల" పదం "సాహసం" లేదా "నిర్భయం" లేదా "ధైర్యసాహసం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి "ధైర్యం కలిగియుండు" పదబంధం "భావోద్రేకంగా బలంకలిగి ఉండు" లేదా "ఆత్మ విశ్వాసం కలిగియుండు" లేదా "స్థిరంగా నిలబడు" అని అనువదించబడవచ్చు.
  • "ధైర్యంతో మాట్లాడు" వాక్యం "ధైర్యసాహసంతో మాట్లాడు" లేదా "భయం లేకుండా మాట్లాడు" లేదా "నమ్మకంతో మాట్లాడు" అని అనువదించబడవచ్చు.

"ప్రోత్సాహించు" “ప్రోత్సాహం" పదాలు ఒకరికి ఆదరణ, నిరీక్షణ, నిబ్బరం, ధైర్యం కలిగించడానికి చెప్పడాన్ని లేదా పనులు చెయ్యడాన్ని సూచిస్తారు.

  • "హెచ్చరించు" పదం ఒకరు చెడు కార్యాన్ని తిరస్కరించాలని ప్రేరేపించడం, బదులుగా మంచిది, సరియైనదానిని చెయ్యడానికి ప్రేరేపించడం అని అర్థం.
  • అపోస్తలుడైన పౌలూ, ఇతర కొత్త నిబంధన రచయితలూ క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సాహించుకుంటూ ప్రేమ చూపుతూ ఉండాలని క్రైస్తవులకు బోధించారు.

"నిరుత్సాహపరచు" పదం ప్రజలు నిరీక్షణనూ, నమ్మకాన్నీ, ధైర్యాన్ని పోగొట్టుకొనేలా చేసే మాటలు మాట్లాడడం లేదా పనులు చెయ్యడాన్ని సూచిస్తుంది. వారు చెయ్యాలని తెలిసిన దానిని కష్టపడి చెయ్యాలనే ఆశను తక్కువ చెయ్యడం అని అర్థం.

అనువాదం సూచనలు

  • సందర్భాన్ని బట్టి, దీన్ని "ప్రోత్సహించు" పదం "ప్రేరేపించు" లేదా "ఆదరించు" లేదా "దయగల మాటలు చెప్పు" లేదా "సహాయం చెయ్యి, సహకారం అందించు" అని అనువదించబడవచ్చు.
  • "ప్రోత్సాహపు మాటలు చెప్పు" అంటే "ప్రజలు తాము ప్రేమించబడ్డారు, అంగీకరించబడ్డారు, శక్తితో నింపబడ్డారు" అని భావించేలా చేసే మాటలు చెప్పు" అని అర్థం.

(చూడండి: నమ్మకం, హెచ్చరించు, భయం, బలం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111