te_tw/bible/other/confidence.md

3.8 KiB

నిబ్బరం, నిబ్బరమైన, నిబ్బరపూర్వక

నిర్వచనం:

"నిబ్బరం" అనే పదం ఏదైనా నిజం అని మనకు తెలిసిన, లేక తప్పక జరుగుతాయన్న ధీమా ఉన్న విషయాలను సూచిస్తుంది.

  • బైబిల్లో, ఈ పదం దేన్నైనా తప్పక జరుగుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఉపయోగించారు. యు ఎల్ బి దీన్ని తరచుగా "నిబ్బరం” లేక “భవిషత్తు గురించి నిబ్బరం” లేక “భవిషత్తు నిబ్బరం" అని తర్జుమా చేసింది. ముఖ్యంగా దేవుడు యేసులో విశ్వాసులకు చేసిన వాగ్దానం నెరవేరుతుందనే ధీమా.
  • తరచుగా ఈ పదం "నిబ్బరం" ముఖ్యంగా విశ్వాసులు యేసులో ఉన్నందువల్ల వారిని కొన్నిరోజుల తరువాత దేవుడు పరలోకంలో శాశ్వతకాలం ఉంచుతాడని సూచిస్తున్నది
  • "దేవునిలో నిబ్బరం కలిగి ఉండడం" అంటే దేవుడు వాగ్దానం చేసిన దానిని సంపూర్ణంగా పొందుతామనే నమ్మకం.
  • "నిబ్బరమైన" అంటే దేవుని వాగ్దానం నమ్మి అయన చెప్పిన దాన్ని అయన తప్పక చేస్తాడని నిశ్చయతతో అంగీకరించడం. ఈ పదాన్ని మరొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ధైర్యంగా, నిర్భీతితో అంగీకరించడం

అనువాదం సలహాలు:

  • "నిబ్బరమైన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిశ్చయత” లేక “చాలా ఖాయం అయిన."
  • "నిబ్బరంగా ఉండడం" అనే మాటను “పూర్తిగానమ్మకముంచు” లేక “దాని విషయం కచ్చితంగా నమ్ము” లేక “ఖాయంగా తెలిసి ఉండు” అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • "నిబ్బరంగా" అనే దాన్ని “ధైర్యంగా” లేక “కచ్చితంగా ఎరిగి" అని కూడా తర్జుమా చెయ్యవచ్చు."
  • సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం. "నిబ్బరం" అనే మాటలో "పూర్ణ నిశ్చయత” లేక “తప్పక జరుగుతుందని ఎదురు చూడడం” లేక “పూర్తి నమ్మకంతో."

(చూడండి: విశ్వసించు, విశ్వసించు, ధైర్యవంతుడు, నమ్మకమైన వాడు, నిరీక్షణ, నమ్మకముంచు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H982, H983, H985, H986, H3689, H3690, H4009, G1340, G2292, G3954, G3982, G4006, G5287