te_tw/bible/kt/trust.md

4.9 KiB

నమ్మకముంచు, నమ్మకముంచడం, నమ్మదగిన, విశ్వసనీయత

నిర్వచనం:

ఏదైనా ఒక దాని మీదా లేదా ఒకరి మీదా "నమ్మకం" ఉంచడం అంటే ఆ వ్యక్తి గానీ, ఆ వస్తువుగానీ వాస్తవం అనీ, అధారపడ దగినదనీ విశ్వసించడం. ఆ నమ్మకం కూడా "విశ్వాసం" అని పిలువబడవచ్చు. "నమ్మదగిన వ్యక్తి" చేసేదీ, చెప్పేదీ సరియైనదనీ, వాస్తవం అనీ మీరు నమ్మవచ్చు. కాబట్టి ఒకరికి విశ్వనీయ లక్షణం కలిగియుండాలి.

  • నమ్మకం అనేది విశ్వాసానికి సమీపంగా ఉంటుంది. మనం ఒకరిని నమ్మినప్పుడు వారు వాగ్దానం చేసినదానిని వారు చేస్తారని మనకు విశ్వాసం ఉంది.
  • ఒకరిమీద నమ్మకం కలిగియుండడం అంటే కూడా ఆ వ్యక్తి మీద ఆదారపడడం అని అర్థం.
  • "యేసులో నమ్మకముంచడం" అంటే ఆయన దేవుడు అని విశ్వసించడం, నీ పాపాలకు వెల చెల్లించడం కోసం ఆయన సిలువ మీద చనిపోయాడని విశ్వసించడం, మనలను రక్షించడం కోసం ఆయన మీద ఆధారపడడం అని అర్థం.
  • "నమ్మదగిన మాట" అంటే చెప్పబడినది సత్యం అనీ ఆదారపడదగినది అనీ సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "నమ్మకముంచు" పదంలో "విశ్వసించుడం” లేదా “విశ్వాసం కలిగి యుండడం” లేదా “ధైర్యం కలిగియుండడం" లేదా “ఆధారపడి యుండడం" పదాలు జతచేయబడవచ్చు.
  • "నీ నమ్మకాన్ని ఆయన మీద ఉంచు" వాక్యానికి "నమ్మకం ఉంచు" అనే అర్థమే ఉంది.
  • "నమ్మదగినది" పదం "అధారపడ దగిన” లేదా లేక “ఆనుకొనదగిన" లేదా "ఎల్లప్పుడూ నమ్మకముంచవచ్చు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: విశ్వసించు, ధైర్యం, విశ్వాసం, విశ్వసనీయ, సత్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 12:12 ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు చనిపోవడం చూసినప్పుడు వారు దేవుని మీద నమ్మకం ఉంచారు, మోషే దేవుని ప్రవక్త అని విశ్వసించారు.
  • 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు దేవునిమీద నమ్మకం ఉంచాడు, ఆయనకు లోబడ్డాడు.
  • 17:02 దావీదు వినయపూర్వకమైన వాడు, నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మాడు, ఆయనకు విధేయత చూపించాడు.
  • 34:06 తమ మంచి క్రియల యందు నమ్మకం ఉంచి ఇతరులను తృణీకరించిన ప్రజల గురించి యేసు ఒక ఉపమానం చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H539, H982, H1556, H2620, H2622, H3176, H4009, H4268, H7365, G1679, G3872, G3982, G4006, G4100, G4276