te_tw/bible/kt/exhort.md

2.7 KiB

హెచ్చరించు, హెచ్చరిక

నిర్వచనం:

"హెచ్చరించు" పదం అంటే సరియైన దానిని చేయమని ఒకరిని బలంగా ప్రోత్సహించడం, పురిగొల్పడం అని అర్థం.

  • హెచ్చరిక ఉద్దేశం ఇతరులు పాపం చేయకుండా ప్రేరేపించడం, దేవుని చిత్తాన్ని అనుసరించేలా ప్రేరేపించడం.
  • క్రైస్తవులు ఒకరినొకరు కఠినంగానూ, అసంబంధంగానూ కాక ప్రేమలో హెచ్చరించుకోవాలని కొత్త నిబంధన బోధిస్తుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "హెచ్చరించు" పదం "బలంగా పురికొల్పు" లేదా "ప్రేరేపించు" లేదా "సలహా ఇవ్వు" అని కూడా అనువదించబడవచ్చు.
  • ఈ పదం అనువాదం చెయ్యడంలో హెచ్చరించే వ్యక్తి కోపంగా ఉన్నట్టు సూచించకుండా చూడండి. ఈ పదం బలాన్నీ, గంభీరతనూ చూపించాలి, కోపంతో కూడిన ప్రసంగాన్ని కాదు.
  • ఎక్కువ సందర్భాల్లో "హెచ్చరించు" అనే పదాన్ని ఉత్తేజపరచడం, తిరిగి హామీ ఇవ్వడం, ఆదరించడం వంటి అర్థాన్ని ఇచ్చే "ప్రోత్సహించు" అనే పదానికి భిన్నంగా అనువదించాలి.
  • సాధారణంగా ఈ పదం ఎదుటి వాని చెడు ప్రవర్తన విషయంలో హెచ్చరించడం, సరిచెయ్యడం అనే అర్థాన్ని ఇచ్చే "మందలించు" అనే పదానికి భిన్నంగా అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G3867, G3870, G3874, G4389