te_tw/bible/other/harp.md

1.9 KiB

వీణ, వీణలు, వైణికుడు

నిర్వచనం:

వీణ అనేది తీగెలున్న సంగీత వాయిద్యం, సారణంగా పెద్ద ఫ్రేము ఉండి, నిలువునా తీగెలు అమర్చి ఉంటాయి.

  • బైబిల్ కాలాల్లో, దేవదారు వృక్ష జాతి కలపను వీణలు ఇతర సంగీత వాయిద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు.
  • వీణలను తరచుగా చేతుల్లో ధరించి మాట్లాడుతూ వాయించేవారు.
  • బైబిల్లో అనేక సార్లు వీణల ప్రస్తావన ఉంది. వీటిని దేవునికి స్తుతి, ఆరాధనకోసం వాడతారు.
  • దావీదు రాసిన అనేక కీర్తనలు వీణపై సంగీతం కూర్చాడు.
  • అతడు సౌలు రాజు కోసం అతడు దురాత్మ మూలంగా ఇబ్బంది పడుతుంటే వీణ వాయించాడు.

(చూడండి: దావీదు, దేవదారు వృక్ష జాతి, కీర్తనలు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3658, H5035, H5059, H7030, G2788, G2789, G2790