te_tw/bible/other/goat.md

3.6 KiB

మేక, మేకలు, మేకతోళ్ళు, భరించే మేక, మేక పిల్లలు

నిర్వచనం:

మేక నాలుగు-కాళ్ళ జంతువు. గొర్రె వంటి జాతి. వీటిని పాలు, మాంసం కోసం పెంచుతారు. చిన్న మేకలను "మేక పిల్ల" అంటారు.

  • గొర్రె లాగానే మేకలు కూడా బలి అర్పణ, ముఖ్యంగా పస్కా బలి సందర్భంలో ప్రాముఖ్యమైన జంతువులు.
  • మేకలు, గొర్రెలు ఒకే విధమైనవైనా కొన్ని విషయాల్లో తేడా ఉంది.
  • మేకల బొచ్చు ముతకగా ఉంటుంది. గొర్రెలకు ఉన్ని ఉంటుంది.
  • మేకతోక నిలబడి ఉంటుంది. గొర్రె తోక కిందికి వేలాడుతూ ఉంటుంది.
  • గొర్రెలు సాధారణంగా మందలుగా ఉంటాయి. అయితే మేకలు కొంత స్వతంత్రంగా మందనుండి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి.
  • బైబిల్ కాలాల్లో, మేకలు తరచుగా ఇశ్రాయేలు ప్రాంతంలో పాలు ఇచ్చే జంతువులు.
  • మేక చర్మాలను గుడారం కప్పే కవర్ గా, ద్రాక్షారసం నిల్వ చేసే తిత్తులుగా వాడతారు.
  • పాత, కొత్త నిబంధనల్లో మేకను అవినీతిపరులైన ప్రజలకు సంకేతంగా ఉపయోగిస్తారు, ఒకవేళ దాన్ని మేపే వారి దగ్గరనుండి వెళ్ళిపోయే అలవాటును బట్టి ఇలా చేస్తుండవచ్చు.
  • ఇశ్రాయేలీయులు మేకలను పాపం మోసుకుపోయే దానికి సంకేతంగా ఉపయోగిస్తారు. ఒక మేకను బలి అర్పణ చేసినప్పుడు యాజకుడు తన చేతులు రెండవ, సజీవ మేక పై ఉంచి ఆపైన మనుషుల పాపాలు ఎడారిలోకి మోసుకుపోయే దానికి సంకేతంగా ఆ జంతువుపై పాపాలు మోపి పంపించి వేస్తాడు.

(చూడండి: మంద, బలి అర్పణ, గొర్రె, న్యాయవంతుడు, ద్రాక్షారసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H689, H1423, H1429, H1601, H3277, H3629, H5795, H5796, H6260, H6629, H6842, H6939, H7716, H8163, H8166, H8495, G122, G2055, G2056, G5131