te_tw/bible/other/destiny.md

4.0 KiB

గమ్యం, గమ్యం కలిగి యుండు, అంతిమ గమ్యం, మున్నిర్ణయం

నిర్వచనం:

"అంతిమ గమ్యం" మనుషులకు భవిషత్తులో సంభవించనున్న దాన్ని సూచిస్తున్నది. ఎవరినైనా ఫలానాది చేస్తాడు అనే "గమ్యం”అతనికి నిర్ణయం అయింది అంటే దాని అర్థం ఆ వ్యక్తి భవిషత్తులో అలా చేస్తాడని దేవుడు నిర్ణయించాడు అని అర్థం.

  • దేవుడు ఒక జాతిని తన ఆగ్రహం కోసం నియమించాడు అంటే ఆయన వారి పాపం మూలంగా ఆ జాతిని శిక్షించేదానికి ఎన్నుకొని నిర్ణయించుకున్నాడు.
  • యూదా నాశనాకై నియమించ బడింది అంటే దేవుడు దాని తిరుగుబాటు కారణంగా యూదాను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
  • ప్రతి వ్యక్తికి చివరి అంతిమ గమ్యం, పరలోకం లేక నరకం.
  • ప్రసంగి గ్రంథకర్త ప్రతి ఒక్కరి అంతిమ గమ్యం ఒకటే, అంటే అందరూ ఎట్టకేలకు చనిపోవడం ఖాయం అన్నాడు.

అనువాదం సలహాలు:

  • "ఆగ్రహానికి నియమించ బడిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. "శిక్షకై నిర్ణయించ బడిన” లేక “నా ఆగ్రహం పాలయ్యారు."
  • అలంకారికంగా "వారి గమ్యం ఖడ్గం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు వారి తమ శత్రువుల చేతిలో కత్తిపాలై నాశనం కావాలని నిర్ణయించాడు” లేక “దేవుడు వారిని వారి శత్రువులు కత్తులతో వధిస్తారని నియమించాడు."
  • "నీవు అలా కావడానికి నియమించబడ్డావు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "దేవుడు ననీవు అలా చెయ్యాలని నిర్ణయించాడు."
  • సందర్భాన్ని బట్టి "అంతిమ గమ్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "చివరి స్థితి” లేక “చివరికి సంభవించేది” లేక “ఏమి జరగాలో దేవుడు నిర్ణయించాడు"

(చూడండి: బందీ, శాశ్వత, పరలోకం , నరకం , యోహాను ( బాప్తిసమిచ్చే), పశ్చాత్తాప పడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2506, H4150, H4487, H4745, H6256, H4507, G5056, G5087