te_tw/bible/other/desecrate.md

2.0 KiB

అపవిత్రత, అపవిత్రపరచు

నిర్వచనం:

ఈ పదం "అపవిత్రపరచు" అంటే ఒక శుద్ధ స్థలం లేక పవిత్ర వస్తువు, ఆరాధనలో వినియోగించే వీలు లేకుండా పాడు చేయడం.

  • అపవిత్రపరచడం అంటే దానిని నీచంగా చేసివెయ్యడం.
  • ఉదాహరణకు, అన్య రాజులు దేవుని ఆలయంలోని పాత్రలను వారి అంతఃపురం విందుల్లో మద్యం తాగడానికి వాడడం ద్వారా అపవిత్రపరచారు.
  • దేవుని ఆలయంలోని బలిపీఠంపై చచ్చిన వారి ఎముకలను శత్రువులు ఉపయోగించారు.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపవిత్రం అయిపోయేలా చేయడం” లేక “అశుద్ధం చేసి మలిన పరచడం” లేక “నీచకరంగా అవమాన పరచి” లేక “అపవిత్రం చెయ్యడం."

(చూడండి: బలిపీఠం, మైల, అప్రతిష్ట , నీచం, శుద్ధ, ఆలయం, పరిశుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2490, H2610, H2930, G953