te_tw/bible/other/defile.md

3.4 KiB

మైల, మైల పడిన, మైల పరిచే, అపవిత్రం చేసే, మైల పడిన

నిర్వచనం:

పదాలు "మైల” “అపవిత్రం" అంటే కలుషితం, మురికి కావడం. భౌతిక, నైతిక, లేక ఆచార పరమైన కాలుష్యం కావచ్చు.

  • తాను "మలినం” “అపరిశుద్ధమైనవిగా” ప్రకటించిన వాటిని తినడం, ముట్టుకోవడం ద్వారా వారు మైల పడకూడదని దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు.
  • మృత శరీరాలు, అంటు వ్యాధులు మొదలైన వాటిని దేవుడు అపవిత్రంగా ప్రకటించాడు. ఇలాటి మైల గల ఒక వ్యక్తిని ఎవరైనా తాకితే వారు మైల బడతారు.
  • లైంగిక పాపాలకు దూరంగా ఉండమని దేవుడు ఇశ్రాయేలీయులను అజ్ఞాపించాడు. ఈ విధంగా మైల పడిన వారు దేవునికి అంగీకారయోగ్యం కాదు.
  • కొన్ని శరీరం నుండి వచ్చే స్రవాలు ఒక మనిషిని తాత్కాలికంగా మైల పడజేస్తాయి. అతడు మరలా ఆచార పరమైనపొందే వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
  • కొత్త నిబంధనలో, పాప పూరితమైన ఆలోచనలు, చర్యలు నిజంగా మనిషిని మైల పడజేస్తాయి అని యేసు బోధించాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "మైల" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మలిన పరిచేది” లేక “అపవిత్రం చేసేది.” లేక “ఆచార పరంగా అంగీకారయోగ్యం కానిది."
  • "మైల పడడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మలినం అయిపోవడం” లేక “నైతికంగా దేవునికి అంగీకారం కాకుండా చెయ్యడం” లేక “ఆచార పరమైన అపవిత్రత"

(చూడండి: శుద్ధ, శుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1351, H1352, H1602, H2490, H2491, H2610, H2930, H2931, H2933, H2936, H5953, G733, G2839, G2840, G3392, G3435, G4696, G5351