2.9 KiB
2.9 KiB
విసరడం, వెళ్ళగొట్టడం, త్రోసి వెయ్యడం
నిర్వచనం:
ఎవరినైనా ఒకరిని లేదా దేనినైనా "విసిరి వెయ్యడం" లేదా "వెళ్ళగొట్టడం" అంటే ఆ వ్యక్తిని గానీ వస్తువును గానీ వెళ్ళిపోయేలా బలవంతం చెయ్యడం.
- "విసిరి వెయ్యడం" పదం "త్రోసి వెయ్యడం" పదం లాంటిదే. వలను విసరండి అంటే వలను నీటిలో త్రోసివెయ్యండి అని అర్థం."
- అలంకారికంగా భావనలో ఒకరిని "బయటకు విసరివెయ్యడం" లేదా "దూరంగా విసిరివెయ్యడం" అంటే అతనిని తృణీకరించడం, వెలుపలికి త్రోసివెయ్యడం అని అర్థం.
అనువాదం సూచనలు:
-
సందర్భాన్ని బట్టి, ఈ పదం "బయటికి నెట్టివెయ్యడం" లేదా "బయటికి పంపివెయ్యడం" లేదా "వదిలించుకోవడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
-
"దయ్యాలను వెళ్ళగొట్టడం" పదబంధం "దయ్యాలు వడిచిపెట్టేలా చెయ్యడం" లేదా "దయ్యాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపించడం" అని అనువదించబడవచ్చు.
-
సమాజమందిరం నుండీ లేదా సంఘం నుండీ ఒకరిని "వెళ్ళగొట్టడం" పదబంధం "బహిష్కరించడం" లేదా "వారిని వెలుపల ఉంచడం" అని అనువదించబడవచ్చు.
(చూడండి: దయ్యం, దయ్యం పట్టిన, చీట్లు)
బైబిలు రిఫరెన్సులు:
- అపొ. కా. 07:17-19
- మార్కు 03:13-16
- మార్కు 09:29
- మత్తయి 07:21-23
- మత్తయి 09:32-34
- మత్తయి 12:24
- మత్తయి 17:19-21
పదం సమాచారం:
- Strong's: H1272, H1644, H1920, H3423, H7971, H7993, G1544