te_tw/bible/other/lots.md

4.4 KiB

చీట్లు, చీట్లు వేయడం

నిర్వచనం:

దేనినైనా నిర్ణయించడానికి ఒక విదానంలా “చీటీ” అనే గుర్తుపెట్టిన ఒక వస్తువును అలాంటి ఇతర వస్తువులలోనుండి ఎంపిక చెయ్యడం. “చీట్లు వేయడం” అంటే గుర్తుపెట్టిన వస్తువులను భూమిమీద గానీ లేదా ఇతర ఉపరితలం మీద ఎగరవేయడం అని అర్థం.

  • తరుచుగా చీట్లు గుర్తుపెట్టిన చిన్న రాళ్ళు లేక పగిలిన కుండ పెంకులుగా ఉంటాయి.
  • కొన్ని సంస్కృతులు గడ్డిపరకలు గుత్తిని ఉపయోగించి చీట్లు “లాగుతారు” లేక “బయటికి తీస్తారు.”

ఒకరు గడ్డిపరకలను గట్టిగా పట్టుకొంటారు, తద్వారా అని ఎంత పొడవు ఉన్నాయో ఎవ్వరూ చూడలేరు. ప్రతీ ఒక్కరూ గడ్డిపరకను బయటికి లాగుతారు, పొడవైనదానిని గానీ (లేక చిన్నదైనదానిని గానీ) బయటికి లాగినవారు ఎంపిక చెయ్యబడతారు.

  • తాము ఏమి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవడం కోసం చీట్లు వేసే అలవాటును ఇశ్రాయేలీయులు అభ్యాసం చేసుకున్నారు.
  • జెకర్యా, ఎలిసెబెతు కాలంలో ఉన్నవిధంగా దేవాలయంలో నిర్దిష్టమైన కాలాలలో ప్రత్యేకమైన కార్యాలని ఏ యాజకుడు చెయ్యాలో ఎంపిక చెయ్యడానికి కూడా చీట్లు వెయ్యడం ఉపయోగించేవారు.
  • యేసును సిలువ వేసిన సైనికులు యేసు పై వస్త్రాన్ని దక్కించుకోడానికి చీట్లు వేసారు.
  • ”చీట్లు వెయ్యడం” అనే పదాన్ని “చీట్లు ఎగరవెయ్యడం” లేక “చీట్లు తీయడం” లేక “చీట్లు దొర్లించడం” అని అనువదించవచ్చు. “వెయ్యడం” అనే పదం యొక్క అనువాదం చీట్లు దూరంగా విసిరి వెయ్యడం అని ఉండకుండా చూడాలి.
  • సందర్భాన్ని బట్టి, “చీటీ” అనే పదం “గుర్తు పెట్టిన రాయి” లేక “కుండ ముక్క” లేక “కర్ర” లేక “గడ్డి ముక్క” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ఒక “చీటీ ద్వారా” నిర్ణయం జరిగినప్పుడు, దాని అనువాదం, “చీటీలు వెయ్యడం (విసరడం) ద్వారా” అని ఉండవచ్చు.

(చూడండి: ఎలిసబెతు, యాజకుడు, జకర్యా, జకర్యా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1486, H2256, H5307, G2624, G2819, G2975, G3091