te_tw/bible/other/armor.md

2.5 KiB

కవచం, ఆయుధాగారం

నిర్వచనం:

“కవచం" ఒక సైనికుడు సమరంలో పోరాడేందుకు, శత్రు దాడినుండి కాపాడుకునేందుకు ఉపయోగించే సరంజామా. దీన్ని అలంకారికంగా ఆత్మ సంబంధమైన కవచం అనడానికి కూడా ఉపయోగిస్తారు.

  • సైనికుని కవచంలో భాగాలు శిరస్త్రాణం, డాలు, ఛాతీ కవచం, పాదరక్షలు, ఖడ్గం.
  • అపోస్తలుడు పౌలు ఈ పదం అలంకారికంగా ఉపయోగించి ఈ భౌతిక కవచాన్ని ఆత్మ సంబంధమైన కవచంతో పోల్చాడు. దీన్ని దేవుడు విశ్వాసికి ఆత్మ సంబంధమైన యుద్ధాలు జరిపేందుకు ఇస్తాడు.
  • ఆత్మ సంబంధమైన కవచం దేవుడు తన ప్రజలు పాపానికి, సాతానుకు వ్యతిరేకంగా పోరాడేటందుకు ఇస్తాడు. ఇవి సత్యం, నీతి, శాంతి సువార్త, విశ్వాసం, రక్షణ, పరిశుద్ధాత్మ.
  • దీన్ని ఈ పదాలతో అనువదించవచ్చు. "సైనికుని ఆయుధాలు” లేక “సమర భద్రత పరికరాలు” లేక “రక్షణ కవచం” లేక “ఆయుధాలు."

(చూడండి: విశ్వాసం, పరిశుద్ధాత్మ, శాంతి, రక్షించు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2185, H2290, H2488, H3627, H4055, H5402, G3696, G3833