te_tw/bible/other/peace.md

6.2 KiB

సమాధానం, శాంతియుత, సమాధానపరచువారు

నిర్వచనం:

“సమాధానం” పదం ఎటువంటి సంఘర్షణ, ఆందోళన లేదా భయం లేకుండా ఉండే స్థితినిగానీ లేదా భావనను గానీ సూచిస్తుంది. "శాంతియుతంగా లేదా సమాధానంగా" ఉండే వ్యక్తి నెమ్మదిగా భావిస్తాడు, సురక్షితంగానూ, భద్రం గానూ ఉండే భావనను కలిగియుంటాడు.

  • పాత నిబంధనలో “సమాధానం" పదం తరచుగా ఒక వ్యక్తి క్షేమం, ఆరోగ్యం లేదా సంపూర్ణతల సాధారణ భావాన్ని సూచిస్తుంది.
  • "సమాధానం" పదం ప్రజల గుంపులు లేదా దేశాలు ఒకరితో ఒకరు యుద్ధాలు లేకుండా ఉన్న సమయాన్ని కూడా కొన్నిసార్లు సూచిస్తుంది. ప్రజలు "శాంతియుత సంబంధాలు" కలిగియున్నారు అని చెప్పవచ్చు.
  • ఒక వ్యక్తితోగానీ లేదా ప్రజల గుంపుతోగానీ “సమాధానపడడం" అంటే యుద్ధాన్ని ఆపగల చర్యలను తీసుకోవడం అని సూచిస్తుంది.
  • “సమాధానపరచువాడు” ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించడానికి ప్రజలను ప్రభావితము చేయడంలో అనేక విషయాలను చెప్పేవాడూ, క్రియలను జరిగించేవాడూ అని అర్థం.
  • ఇతర ప్రజలతో “సమాధానంగా ఉండడం" అంటే ఆ ప్రజలకి విరుద్ధముగా పోరాటము చేయని స్థితిలో ఉండడం అని అర్థం.
  • దేవుడు మరియు ప్రజల మధ్యన మంచి సంబంధం లేదా సరియైన సంబంధం కేవలం దేవుడు తన ప్రజలను పాపమునుండి విడిపించినప్పుడే ఏర్పడుతుంది. దీనినే “దేవునితో సమాధానం” కలిగియుండడం అంటారు.
  • “కృప మరియు సమాధానం” పదాలు తమ తోటి విశ్వాసులకు ఆశీర్వాదంగా అభివందనాలు తెలియజేయడానికి తమ ఉత్తరాలలో అపొస్తలులు ఉపయోగించారు.
  • "సమాధానం" పదం ఇతరప్రజలతో గానీ లేదా దేవునితో గానీ మంచి సంబంధంలో ఉండడాన్ని కూడా సూచిస్తుంది.

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 15:06 కానానులోనున్న ఎటువంటి ప్రజల గుంపుతోనైనను సమాధాన ఒప్పందం చేసుకోవద్దని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
  • 15:12 దేవుడు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించాడు.
  • 16:03 వారి శత్రువులనుండి విడిపించగల విమోచకుడిని దేవుడు అనుగ్రహించెను మరియు ఆ దేశమునకు సమాధానమును అనుగ్రహించాడు.
  • 21:13 ఆయన (మెస్సీయా) తన ప్రజల పాపముల శిక్షను అనుభవించడం కోసం చనిపోతాడు. ఆయన మీద పడిన శిక్ష ద్వారా దేవునికీ, మనుష్యులకూ మధ్య సమాధానం కలిగింది.
  • 48:14 దావీదు ఇశ్రాయేలుకు రాజైయుండెను, అయితే యేసు సమస్త విశ్వమునకు రాజైయున్నాడు. ఆయన మరలా వస్తాడు, మరియు సదాకాలము న్యాయముతోనూ, సమాధానముతోనూ తన రాజ్యమును పరిపాలించును.
  • 50:17 యేసు న్యాయముతోనూ మరియు సమాధానముతోను తన రాజ్యమును ఏలును, మరియు ఆయన తన ప్రజలతో సదాకాలము ఉండును.

పదం సమాచారం:

  • Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272