te_tw/bible/names/silas.md

4.9 KiB

సీల, సిల్వాను

వాస్తవాలు:

సీల యెరూషలేములోని విశ్వాసుల మధ్యన నాయకుడైయుండెను.

  • యెరూషలేములోని సంఘ పెద్దలందరు అంతియొకయ పట్టణమునకు పత్రికను తీసుకొని వెళ్ళుటకు పౌలు మరియు బర్నబాలతో వెళ్ళుటకు సీలను నియమించిరి.
  • కొద్ది కాలమైన తరువాత యేసు క్రీస్తును గూర్చి ప్రజలకు బోధించుటకు ఇతర పట్టణములకు పౌలుతో సీల కూడా ప్రయాణము చేసెను.
  • పౌలు సీలలను ఫిలిప్పి పట్టణములోని చెరసాలలో వేసిరి. వారు చెరసాలలో ఉన్నప్పుడే దేవునిని పాటలు పాడి స్తుతించిరి మరియు దేవుడు వారిని చెరనుండి విడిపించెను. చెరసాల అధిపతి వారికి జరిగిన సాక్ష్యమును వినుట ద్వారా క్రైస్తవుడిగా మారిపోయెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అంతియొకయ, బర్నబా, యెరూషలేము, పౌలు, ఫిలిప్పి, చెర, సాక్ష్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 47:01 ఒక రోజున పౌలు మరియు తన స్నేహితుడైన సీల ఇరువురు కలిసి యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించుటకు ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళిరి.
  • 47:02 ఆమె (లుదియ) తన ఇంట బస చేయుటకు పౌలును మరియు సీలను ఆహ్వానించెను, అందుచేత వారు ఆమె ఇంట ఆమెతోపాటు బసచేసిరి.
  • 47:03 పౌలు మరియు సీలలు అనేకమార్లు ప్రార్థన చేసికొను స్థలములో ప్రజలను కలిసికొనిరి.
  • 47:07 అందుచేత బానిసయైన అమ్మాయి యజమానులు పౌలును మరియు సీలను రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్లి, వారిని జైలులోనికి వేయించిరి.
  • 47:08 వారు పౌలు మరియు సీలను చెరసాలలోని అతీ భద్రమైన స్థలములో వేసి, వారి కాళ్లకు బొండలను బిగియించిరి.
  • 47:11 చెరసాల అధికారి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను?” అని అడిగెను.
  • 47:13 ఆ మరుసటి రోజున పట్టణ నాయకులు పౌలు సీలలను చెరసాలనుండి విడుదల చేసిరి మరియు ఫిలిప్పి పట్టణమును విడిచి వెళ్లిపొమ్మని వేడుకొనిరి. పౌలు మరియు సీల లుదియాను మరియు ఇతర కొంతమంది స్నేహితులను దర్శించి, పట్టణమును విడిచి వెళ్లిపోయిరి.

పదం సమాచారం:

  • Strong's: G4609, G4610