te_tw/bible/names/lazarus.md

3.9 KiB

లాజరు

వాస్తవాలు:

లాజరూ అతని చెల్లెళ్ళు, మరియ, మార్త యేసుకు ప్రత్యేకమైన స్నేహితులు. బెతనియలో వారి ఇంటిలో యేసు తరుచుగా ఉండేవాడు.

  • అనేక దినములు సమాధిలో ఉంచిన తరువాత మరణం నుండి యేసు లాజరును తిరిగి లేపిన కారణంగా లాజరు బాగా ప్రసిద్ధి అయ్యాడు.
  • యూదా నాయకులు యేసు విషయంలో చాలా కోపంగా ఉన్నారు, ఈ ఆశ్చర్యకార్యం చేసినందుకు అసూయతో నిండిపోయారు. అందుచేత వారు లాజరునూ, యేసునూ చంపాలని చూసారు.
  • పేదవాడు, ధనవంతుడు ఉపమానాన్ని కూడా యేసు వారికి చెప్పాడు, పేదవాని పేరు “లాజరు.”

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 37:01 ఒక దినాన్న, లాజరు జబ్బుపడ్డాడని యేసుకు సందేశం వచ్చింది. లాజరు, అతని ఇద్దరు చెల్లెళ్ళు, మరియ, మార్త యేసుకు సన్నిహితమైన స్నేహితులు.
  • 37:02”మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని మేల్కొలపడానికి వెళ్తాను” అని యేసు అన్నాడు.
  • 37:03 అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటె బాగుపడతాడు” అనారు. అప్పుడు యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు, “లాజరు చనిపోయాడు.”
  • 37:04 యేసు లాజరు గ్రామానికి వచ్చినప్పుడు, లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూసాడు.
  • 37:06లాజరును మీరెక్కడ ఉంచారు?” అని యేసు వారిని అడిగాడు.
  • 37:09 అప్పుడు యేసు “లాజరూ, బయటకు రా” అని బిగ్గరగా అడిగాడు.
  • 37:10 కాబట్టి లాజరు బయటికి వచ్చాడు! సమాధి కట్లు అతని కాళ్ళకూ, చేతులనూ కట్టి ఉన్నాయి.
  • 37:11 అయితే యూదా మత నాయకులు అసూయతో నిండిపోయారు, కాబట్టి వారు కలిసి యేసునూ లాజరునూ చంపాలని ఆలోచించారు.

పదం సమాచారం:

  • Strong's: G2976