te_tw/bible/other/beg.md

4.0 KiB

భిక్షమెత్తు, అర్థించు, భిక్షగాడు

నిర్వచనం:

ఈ పదం "భిక్షమెత్తు"అంటే ఎవరినైనా దేని కోసమైనా అత్యవసరంగా అడగడం. తరచుగా ఇది డబ్బు అడగడానికి వర్తిస్తుంది. అయితే సాధారణంగా దీన్ని దేని కోసమైనా బ్రతిమాలే సందర్బాలలో కూడా ఉపయోగిస్తారు.

  • తరచుగా మనుషులు ఏదైనా అత్యవసరం అయితే ఎదుటి వ్యక్తి తాము అడిగినది ఇస్తాడో లేదో తెలియక పోతే బ్రతిమాలుతారు. భిక్షమెత్తుతారు.
  • "భిక్షగాడు" క్రమం తప్పకుండా ఒక బహిరంగ ప్రదేశంలో కూర్చుని, లేక నిలబడి మనుషులను డబ్బు అడుగుతూ ఉంటాడు.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఇలా అనువదించ వచ్చు. "అర్థించు” లేక “బ్రతిమాలి అడుగు” లేక “డబ్బు ఇమ్మని అడుగు” లేక “అనుదినం భిక్షం అడుగుతారు."

(చూడండి: అర్థించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 10:04 దేవుడు ఈజిప్టు మీదికి కప్పలను పంపించాడు. కప్పలను తొలగించమని మోషేను ఫరో బ్రతిమాలాడు.
  • 29:08 "రాజు సేవకునితో ఇలా చెప్పాడు, “దుర్మార్గ సేవకా! నీవు నన్ను బ్రతిమలావు గనక నీ అప్పు అంతా క్షమించాను."
  • 32:07 దయ్యాలు యేసును, "ఈ ప్రాంతం నుండి వెళ్ళగొట్ట వద్దు!"అని బ్రతిమలుకున్నాయి. కొండపై కొన్ని పందులు మేస్తున్నాయి. కాబట్టి, దయ్యాలు యేసును, "దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి పంపు!"అని వేడుకున్నాయి.
  • 32:10 దయ్యాలు పట్టిన ఆ మనిషి యేసును ఆయనతో రానిమ్మని బ్రతిమాలాడు.
  • 35:11 అతని తండ్రి లోపలికి సంబరంలో పాల్గొనమని అతణ్ణి బ్రతిమాలాడు. అయితే అతడు నిరాకరించారు."
  • 44:01 ఒక రోజు పేతురు, యోహాను ఆలయానికి వెళ్తున్నారు. వారు ఆలయం ద్వారం సమీపిస్తుండగా ఒక అవిటి మనిషిని భిక్షమెత్తుకుంటూ ఉండగా చూశారు.

పదం సమాచారం:

  • Strong's: H34, H7592, G154, G1871, G4319, G4434, G6075