te_tw/bible/other/plead.md

2.7 KiB

అభ్యర్ధన, అభ్యర్ధనలు, వేడుకో, వేడుకొనుట, వేడుకొనబడెను, వేడుకొనుచుండుట, వేడుకొనుటలు

వాస్తవాలు:

“వేడుకో” మరియు “వేడుకొనుచుండుట” అనే పదములు ఏదైనా పని చేయుటకు ఎవరినైనా తక్షణమే అడగడమును సూచిస్తుంది. “అభ్యర్ధన” అనునది తక్షణముగా విన్నవించుకోవడమునైయున్నది.

  • వేడుకొనుట అనునది అనేకమార్లు ఒక వ్యక్తి చాలా గొప్ప అవసరతలో ఉండుటను లేక సహాయము కొరకు బలముగా అర్థించుటను సూచిస్తుంది.
  • ప్రజలు దేవుడు తన కరుణను తమపై చూపాలని లేక వారికి ఏదైనా అనుగ్రహించాలని తక్షణమే విన్నపము తెలియజేస్తుంటారు, ఈ విన్నపము వారికొరకైనా కావచ్చు లేక ఇంకొకరికొరకైనా కావచ్చు.
  • ఈ పదమును అనువాదము చేసే వేరొక విధానములో “యాచించుట” లేక “దీనంగా అర్థించుట” లేక “తక్షణమే అడుగుట’ అనే మాటలను ఉపయోగించుదురు.
  • “అభ్యర్ధన” అనే పదమును “తక్షణ మనవి” లేక “బలమైన విజ్ఞప్తి” అని కూడా తర్జుమా చేయుదురు.
  • ఈ పదము డబ్బుల కొరకు యాచించుట అనే అర్థము తీసుకొని రాకుండా ఈ సందర్భములో జాగ్రత్తపడండి.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1777, H2603, H3198, H4941, H4994, H6279, H6293, H6664, H6419, H7378, H7379, H7775, H8199, H8467, H8469, G1189, G1793, G2065, G3870