2.9 KiB
2.9 KiB
మహా హేరోదు
వాస్తవాలు:
మహా హేరోదు యేసు పుట్టిన కాలంలో పాలకుడు. అతడు రోమా సామ్రాజ్యం ఆ భాగాలను పరిపాలించిన హేరోదు అనే పేరు గల అనేక ఎదోమీయ అధిపతుల్లో మొదటివాడు.
- అతని పూర్వీకులు యూదుమతంలోకి మారారు. అతడు యూదుడుగా పెరిగాడు.
- కైసరు అగస్టస్ అతడు నిజంగా రాజు కాకపోయినా అతనికి "రాజైన హేరోదు" అనే బిరుదు ఇచ్చాడు. అతని పరిపాలన యూదులపై యూదాలో 33 సంవత్సరాలు కోన సాగింది.
- మహా హేరోదు చాలా అందమైన భవనాల నిర్మాణానికి ఆదేశించాడు. అతడు యెరూషలేములో యూదు ఆలయం తిరిగి కట్టడం మొదలు పెట్టాడు.
- హేరోదు చాలా క్రూరమైన మనిషి. అనేక మందిని అతడు చంపించాడు. "యూదుల రాజు" బెత్లెహేములో పుట్టాడని విన్నప్పుడు అతడు ఆ పసి వాడిని చంపించ డానికి ఆజ్ఞ ఇచ్చాడు.
- తన కుమారులు హేరోదు అంతిప, హేరోదు ఫిలిప్పు, తన మనవడు హేరోదు అగ్రిప్ప కూడా రోమా అధిపతులుగా పరిపాలించారు. తన ముని మనవడు హేరోదు రెండవ అగ్రిప్ప (ఇతన్ని "అగ్రిప్ప రాజు" అని పిలిచాడు). ఇతడు మొత్తం యూదా ప్రాంతం అంతటినీ పరిపాలించాడు.
(చూడండి పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: హేరోదు అంతిప, యూదా, రాజు, ఆలయం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2264