te_tw/bible/names/adam.md

3.8 KiB

ఆదాము

వాస్తవాలు:

ఆదాము దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి. అతడు, అతని భార్య హవ్వ దేవుని పోలికలో చెయ్యబడ్డారు.

  • దేవుడు ఆదామును దుమ్ము నుండి చేసి అతనిలోకి జీవం ఊదాడు.
  • ఆదాము పేరు "ఎర్ర మట్టి” లేక “నేల"అని అర్థం ఇచ్చే హీబ్రూ పదానికి దగ్గరగా ఉంది.
  • "ఆదాము"అనే పేరు "మానవ జాతి” లేక “మానవుడు"అనే పాత నిబంధన పదం అయింది.
  • మనుషులంతా ఆదాము, హవ్వల సంతానం.
  • ఆదాము, హవ్వలు దేవునికి లోబడలేదు. ఇది వారిని దేవునికి దూరం చేసి పాపం, మరణం లోకంలోకి వచ్చేలా చేసింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మరణం, సంతతి వాడు, హవ్వ, దేవుని పోలిక, జీవం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 01:09 అప్పుడు దేవుడు అన్నాడు, "మానవులను మన పోలికలో ఆకారంలో చేద్దాము."
  • 01:10 ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఒక తోట నాటి, అక్కడ ఆదాము నివసించి దాన్ని సాగు చేసేలా నియమించాడు.
  • 01:12 అప్పుడు దేవుడు చెప్పాడు, "మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు." కానీ జంతువులు ఏవీ ఆదాము తోడు కాలేదు.
  • 02:11 దేవుడు ఆదాము హవ్వలకు జంతువు చర్మాలు తొడిగాడు.
  • 02:12 కాబట్టి దేవుడు ఆదాము హవ్వలను ఆ అందమైన తోటనుండి వెళ్ళగొట్టాడు.
  • 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతానంపై కూడా ప్రభావం చూపింది.
  • 50:16 ఎందుకంటే ఆదాము హవ్వ దేవునికి లోబడలేదు. వారి ఈ లోకంలోకి పాపాన్ని తెచ్చారు. దేవుడు దాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H120, G76