te_tw/bible/names/eve.md

3.5 KiB

హవ్వ

వాస్తవాలు:

మొదటి స్త్రీ పేరు. ఆమె పేరుకు అర్థం "జీవం” లేక “ప్రాణం గల."

  • దేవుడు ఆదాము నుండి పక్కటెముక తీసి హవ్వను చేశాడు.
  • హవ్వను ఆదాముకు "సహాయకురాలుగా" చేశాడు. ఆమె ఆదాము వెంట ఉండి దేవుడు అతనికి ఇచ్చిన పనిలో సహకరించాలి.
  • హవ్వను సాతాను (పాము రూపంలో) విషమ పరీక్షకు గురిచేసి మొదటగా దేవుడు తినవద్దన్న పండు తినడం ద్వారా పాపం చేయించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆదాము, జీవం, సాతాను)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 01:13 తరువాత దేవుడు ఆదాము పక్కటెముకల్లో ఒకటి తీసి ఒక స్త్రీగా చేసి, ఆమెను ఆదాము దగ్గరికి తెచ్చాడు.
  • 02:02 అయితే ఆ తోటలో కుటిలమైన పాము ఉన్నాడు. అతడు ఆ స్త్రీని ఇలా అడిగాడు. "దేవుడు నిజంగా తోటలోని ఏ చెట్టు పండు తినవద్దు అన్నాడా?"
  • 02:11 అతని భార్య పేరు హవ్వ, అంటే "జీవం ఇచ్చేది" ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి అవుతుంది.
  • 21:01 దేవుడు వాగ్దానం చేశాడు. మానవ సంతతి వాడు హవ్వకు జన్మించి పాము శిరస్సు చితకగొడతాడు.
  • 48:02 సాతాను తోటలో పాము ద్వారా మాట్లాడి తద్వారా హవ్వను మోసగించాడు.
  • 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతానంఅంతటినీ చెరిపింది.
  • 50:16 ఎందుకంటే ఆదాము హవ్వ దేవునికి లోబడలేదు. వారు లోకంలోకి పాపాన్ని తెచ్చారు. దేవుడు వారిని శపించి నాశనం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H2332, G2096