te_tw/bible/kt/imageofgod.md

3.3 KiB

దేవుని పోలిక, స్వరూపం

నిర్వచనం:

"స్వరూపం" అంటే వేరే రూపంలో దాని గుణ లక్షణాలు, సారాంశం ప్రతిబింబిస్తూ ఉండే వస్తువు. "దేవుని పోలిక" అనే సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఉపయోగిస్తారు.

  • సృష్టి ఆరంభంలో దేవుడు మానవులను తన స్వరూపంలో అంటే "తన పోలికలో" చేశాడు. అంటే మనుషుల్లో దేవుని పోలికను ప్రతిబింబిస్తూ ఉండే కొన్ని గుణ లక్షణాలు, భావోద్వేగాలు అనుభవించే సామర్థ్యం, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, నిత్యం జీవించే ఆత్మ మొదలైనవి.
  • బైబిల్ బోధిస్తున్నట్టుగా యేసు, దేవుని కుమారుడుగా " దేవుని పోలికలో" అంటే దేవుడే అయి ఉన్నాడు. మానవుల వలె కాక, యేసు సృష్టించబడిన వాడు కాదు. నిత్యత్వం నుండి దేవుడు కుమారుడు అన్ని దివ్య గుణ లక్షణాలు గలవాడు. ఎందుకంటే ఆయనలో తండ్రి అయిన దేవుని స్వరూపం ఉంది.

అనువాదం సలహాలు:

  • యేసును గురించి చెప్పేటప్పుడు "దేవుని పోలిక" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఉన్నది ఉన్నట్టుగా పోలిక దేవుని” లేక “దేవుని సారాంశం” లేక “దేవుని వంటి."
  • మానవుల గురించి అయితే, "దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "దేవుడు వారిని తనలా ఉండాలని సృష్టించాడు” లేక “దేవుడు వారిని తన స్వంత గుణ లక్షణాలతో సృష్టించాడు."

(చూడండి: స్వరూపం, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4541, H1544, H2553, H6456, H6459, H6754, H6816, H8403, G504, G179