te_tw/bible/kt/trespass.md

2.5 KiB

అపరాధం, అపరాధాలు, అతిక్రమించు

నిర్వచనం:

"అపరాధం” చేయడం అంటే చట్టం మీరడం లేక వేరొకరి హక్కులు ఉల్లంఘించడం. "అతిక్రమం" అంటే "ఆజ్ఞ మీరడం."

  • అతిక్రమం అంటే నైతిక, లేదా సాంఘిక చట్టం, లేక మరొక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.
  • ఈ పదానికి "పాపం,” “అపరాధం," అనే పదాలతో ముఖ్యంగా దేవుణ్ణి ధిక్కరించడంతో సంబంధం ఉంది.
  • అన్ని పాపాలు దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలే.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, " వ్యతిరేకంగా అతిక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వ్యతిరేకంగాపాపం” లేక “పరిపాలనను ధిక్కరించడం."
  • కొన్నిభాషల్లో "హద్దు మీరడం" వంటి పదాలు "అతిక్రమం" అనే దాన్ని అనువదించడంలో ఉపయోగిస్తారు.
  • ఈ పదాన్ని బైబిల్ వచనంలో ఉన్న అర్థంతో పోల్చి అపరాధం” “పాపం" అనే ఒకే విధమైన అర్థం వచ్చే వాటిని వాడవచ్చు.

(చూడండి: ధిక్కరించు, అక్రమం, పాపం, అపరాధం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900