te_tw/bible/kt/tetrarch.md

2.7 KiB

చతుర్దాధిపతి

నిర్వచనం:

"చతుర్దాధిపతి" రోమాసామ్రాజ్యం ఒక భాగాన్ని పరిపాలించే అధికారిని పిలిచే పేరు. ప్రతి చతుర్దాధిపతి రోమా చక్రవర్తి అధికారం కింద ఉంటాడు.

  • "చతుర్దాధిపతి" అనే బిరుదు నామం అర్థం "నాలుగు పరగణాలకు అధిపతి."
  • డయోక్లిషియన్ చక్రవర్తి కాలంలో మొదలై రోమాసామ్రాజ్యంలో నాలుగు ముఖ్య పరగణాలు ఉండేవి. ప్రతిదీ ఒక చతుర్దాధిపతి పరిపాలన చేసేవాడు.
  • యేసు పుట్టుక సమయంలో ఏలిన మహా హేరోదు రాజ్యం అతని మరణం తరువాత నాలుగు విభాగాలయింది. అతని కుమారులు "చతుర్దాధిపతులుగా” లేక “నాలుగవ భాగం అధిపతులు” గా పాలించారు.
  • ప్రతి జిల్లా లో కొన్ని చిన్నభాగాలను"పరగణాలు," అని పిలిచారు. అలాటివే గలిలయ, సమరయ.
  • "హేరోదు చతుర్దాధిపతి" అనే దాన్ని కొత్త నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించారు. అతణ్ణి "హేరోదు అంతిప" అని కూడా అంటారు.
  • దీన్ని "చతుర్దాధిపతి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ప్రాంతం గవర్నర్” లేక “సామంత అధిపతి” లేక “అధిపతి” లేక “గవర్నర్" అనవచ్చు.

(చూడండి: గవర్నర్, హేరోదు అంతిప, పరగణా, రోమ్, అధిపతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5075, G5076