te_tw/bible/kt/kingofthejews.md

4.2 KiB

యూదులకు రాజు, యూదుల రాజు

నిర్వచనం:

“యూదుల రాజు” అనే పదం మెస్సీయ అయిన యేసును సూచించే బిరుదు.

  • ”యూదులకు రాజు” గా పుట్టినవానిని దర్శించడానికి బెత్లేహెంకు ప్రయాణమైన జ్ఞానులు వినియోగించినపుడు ఈ బిరుదును బైబిలు మొట్టమొదటి సారి నమోదు చేసింది.
  • దావీదు సంతానమైన తన కుమారుడు రాజుగా ఉంటాడని, తన పరిపాలన శాస్వితంగా ఉంటుందని దూత మరియకు తెలియజెప్పాడు.
  • యేసు సిలువ వేయబడడానికి ముందు రోమా సైనికులు యేసును “యూదులకు రాజు” అని హేళన చేసారు. ఈ బిరుదు ఒక చెక్క ముక్కపై రాసి యేసు సిలువకు పైగా దానిని కొట్టారు.
  • యేసు నిజముగా యూదులకూ, సమస్త సృష్టి మీదా రాజుగా ఉన్నాడు.

అనువాదం సూచనలు:

“యూదులకు రాజు” అనే పదాన్ని “’యూదుల పై రాజు” లేక “యూదుల మీద ప్రభుత్వం చేసే రాజు” లేక “యూదుల సరశ్రేష్ట పరిపాలకుడు” అని అనువదించవచ్చు.

  • ”రాజు” అనే మాట అనువాదంలో ఇతర స్థలాలో ఏవిధంగా అనువదించబడిందో చూడండి.

(చూడండి: సంతానం, యూడుడు, యేసు, రాజ్యము, దేవుని రాజ్యము, జ్ఞానులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 23:09 కొంత కాలం అయిన తరువాత, దూర దేశములలోని జ్ఞానులు తూర్పు దిక్కున ఆకాశంలో ఒక అసహజమైన నక్షత్రాన్ని చూసారు. యూదులకు రాజు గా ఒక కొత్త రాజు పుడుతున్నాడని వారు గుర్తించారు.
  • ౩౯:12 “నీవు యూదులకు రాజువా?” అని పిలాతు యేసును అడిగాడు.
  • 39:12 రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టారు, రాజ వస్త్రాన్ని ధరింపజేశారు, ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయనమీద పెట్టారు. “యూదులకు రాజు ను చూడండి” అని ఆయనను హేళన చేసారు!
  • 40:02 ఒక చెక్క ముక్క మీద “యూదులకు రాజు అని రాయించి సిలువమీద యేసు తలకుపైగా ఉంచాలని పిలాతు ఆజ్ఞాపించాడు.

పదం సమాచారం:

  • Strong's: G935, G2453