te_tw/bible/kt/abomination.md

3.4 KiB

హేయము, హేయ క్రియలు, హేయమైన

నిర్వచనం:

"హేయము"అనే పదాన్ని తీవ్రమైన అసహ్యం కలిగించే దాన్ని చెప్పడానికి వాడారు.

  • ఈజిప్టు వారు హెబ్రీయులను "హేయము"గా ఎంచారు. అంటే ఈజిప్టు వారు హెబ్రీయులను "హేయము"గా ఎంచి వారితో పొత్తు పెట్టుకునేందుకు, వారికి దగ్గరగా నివసించడానికి ఇష్టపడలేదు.
  • బైబిల్ "యెహోవాకు హేయము"అని చెప్పిన కొన్ని విషయాలు అబద్ధం, గర్వం, నర బలి, విగ్రహ పూజ, హత్య, వ్యభిచారం, స్వలింగ సంపర్కం వంటి లైంగిక క్రియలు.
  • యుగాంత కాలం గురించి యేసు తన శిష్యులకు బోధిస్తూ, దానియేలు ప్రవక్త చెప్పినట్టు "నాశనం కలిగించే హేయవస్తువు"ను దేవునిపై తిరుగుబాటుగా నిలుపుతారని, అయన ఆరాధన స్థలాన్ని మైల పరుస్తారని చెప్పాడు.

అనువాదం సలహాలు:

  • "హేయము"అనే పదాన్ని "దేవునికి అసహ్యం"లేక "నీచమైనది"లేక "హేయమైన కర్మ కాండ"లేక "చాలా చెడ్డ పని"అని తర్జుమా చెయ్యవచ్చు.
  • సందర్భాన్ని బట్టి "అలా చెయ్యడం హేయము"అనే దాన్ని "బహు అసహ్యకరం"లేక "చెప్పరానంత అసహ్యం"లేక "ఎంత మాత్రం ఆమోద యోగ్యం కానిది" లేక "పరమ అసహ్యం పుట్టించేది" అని తర్జుమా చెయ్య వచ్చు.
  • "హేయవస్తువు" అనే మాటను "ఒక దాన్ని అపవిత్ర పరచి మనుషులకు గొప్ప హాని కలిగించేది"లేక "గొప్ప విషాదం మిగిల్చే అసహ్యకరమైనది"అని తర్జుమా చెయ్య వచ్చు.

(చూడండి: వ్యభిచారము, మైల పరచు, నాశనకరమైన, అబద్ద దేవుడు, బలి అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H887, H6292, H8251, H8262, H8263, H8441, G946