2.9 KiB
2.9 KiB
మూల పాఠo కోసం పరిగణించవలసిన అంశాలు
మూల పాఠాన్ని ఎంచుకునేటప్పుడు, పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి:
- విశ్వాస ప్రకటన - మూల పాఠo విశ్వాస ప్రకటనకు అనుగుణంగా ఉందా?
- అనువాద మార్గదర్శకాలు - మూల పాఠo అనువాద మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా?
- భాష - మూల పాఠాన్ని అనువాదకులూ, సరి చేసే వారూ తగిన విధంగా అర్థం చేసుకునే భాషలో ఉందా?
- ప్రచురుణాధికారం, అనుమతి పత్రం, మూల గ్రంధాలు - తగిన చట్టపరమైన స్వేచ్ఛను ఇచ్చే అనుమతి పత్రం ద్వారా మూల గ్రంధాన్ని విడుదల చేయడం జరిగిందా?
- మూల గ్రంధాలు, భాషాంతరపు సంఖ్యలు - మూల గ్రంధం సరికొత్తదైన, అత్యంత నవీకరించిన భాషాంతరమా?
- సహజ భాషలు, మూలభాషలు - అనువాద బృందం సహజ భాషలకూ, మూల భాషలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటుందా?
- అసలైన రాతప్రతులు - అసలైన రాతప్రతులూ, మూల గ్రంధమందలి వైవిధ్యాలు గురించి అనువాద బృందం అర్థం చేసుకుంటుందా?
మూల గ్రంధం మంచిదని భాషా సమూహంలోని సంఘంలా నాయకులు అంగీకరించడం ప్రాముఖ్యమైన విషయం. వెల్లడియైన బైబిలు కథలు అనేక మూల భాషలలో http://ufw.io/stories/ లో అందు బాటులో ఉన్నాయి. అలాగే ఆంగ్లంలో అనువాదానికి మూలాలుగా ఉపయోగించటానికి బైబిలు అనువాదాలు ఉన్నాయి, అదే విధంగా త్వరలో ఇతర భాషలు కూడా ఉన్నాయి.