te_ta/translate/translate-manuscripts/01.md

3.7 KiB

ఆదిమ రాత ప్రతుల రచన

బైబిలు అనేక సంవత్సరాల క్రితం దేవుని ప్రవక్తలు, అపోస్తలుల చేత రాయబడింది. దేవుడు వారు రాయడానికి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీ భాష మాట్లాడేవారు. అందుచేత పాత నిబంధనలోని అనేక గ్రంథాలు హెబ్రీ బాషలో రాయబడ్డాయి . వారు అష్శూరులోనూ, బబులోనూ పరదేశులుగా నివశిస్తున్నప్పుడు వారు అరామిక్ బాష మాట్లాడడం నేర్చుకొన్నారు. అందుచేత పాత నిబంధనలోని చివరి భాగాలు కొన్ని అరామిక్ బాషలో రాయబడ్డాయి.

ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు గ్రీకు ప్రధాన సమాచార భాషగా మారింది. ఐరోపా, మధ్య తూర్పు దేశాలలో ఉన్న ప్రజలు గ్రీకు బాషను తమ రొండో బాషగా మాట్లాడారు. కనుక పాతనిబంధన గ్రీకు బాషలోనికి అనువదించారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రపంచంలోని ఆ యా ప్రాంతాలలోని ప్రజలు గ్రీకు బాషను మాట్లాడుతూనే వచ్చారు. కొత్తనిబంధనలోని అన్ని గ్రంథాలు గ్రీకు బాషలో రాసి ఉన్నాయి.

ముద్రణా యంత్రాలు లేనప్పుడు, రచయితలు ఈ గ్రంథాలను చేతులతో రాశారు. ఇవి ఆదిమ వ్రాత ప్రతులు. వీటి ప్రతులు తయారు చేసినవారు కూడా చేతితోనే రాశారు. ఇవి రాత ప్రతులుగా ఉన్నాయి. ఈ గ్రంథాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అందుచేత వాటిని తిరిగి రాసేవారు ప్రత్యేకమైన తర్ఫీదు తీసుకొన్నారు, వాటిని కచ్చితంగా రాయడంలో చాలా జాగ్రత్త తీసుకొన్నారు.

అనేక వందల సంవత్సరాలుగా, ప్రజలు వేలకొలది బైబిలు ప్రతులను తయారు చేశారు. ఆదిమ కాలంలో రచయితలు రాసిన రాత ప్రతులు అన్నీ పాడైపొయ్యాయి, దూరంగా పడిపోయాయి. కనుక అవి మనకు లేవు. అయితే చాలా కాలం క్రితం చేతితో రాసిన ప్రతులు మనకు ఉన్నాయి. వీటిలో కొన్ని అనేక వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కూడా నిలిచియున్నాయి.