te_ta/translate/translate-textvariants/01.md

10 KiB

వివరణ

వేల సంవత్సరాల క్రితం మనుష్యులు బైబిలులోని గ్రంథాలను రాశారు. ఇతరులు వాటిని చేతితో రాసి, అనువదించారు. వారు ఆ పనిని చాలా జాగ్రత్తగా చేసారు. సంవత్సరాలుగా చాలా మంది వేల కొలది నకలు ప్రతులను తయారు చేశారు. అయితే ఆ తరువాత, వాటిని చూసినవారు వాటి మధ్య చిన్న తేడాలు ఉన్నాయని గ్రహించారు. నకళ్ళు రాసే కొంతమంది అనుకోకుండా కొన్ని పదాలను వదిలి వేసారు, మరికొందరు ఒక పదాన్నివేరే తప్పు పదంగా భావించారు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా ఏదైనా వివరించాలనుకున్నప్పుడు కొన్ని పదాలనూ, లేదా మొత్తం వాక్యాలను వారు జోడించారు. పాత నకళ్ళకు సంబంధించిన అనువాదాలు ఆధునిక బైబిళ్ళలో ఉన్నాయి. యు.ఎల్.టి లో ఈ అదనపు వాక్యాలు సాధారణంగా కింద ఇవ్వబడిన వివరణలో వ్రాయడం జరిగింది.

బైబిలు పండితులు అనేకమైన పాతనకళ్ళను చదివి ఒక దానితో ఒకటి పోల్చారు. బైబిలులో వ్యత్యాసం ఉన్న ప్రతి చోట, ఏ పదాలు కచ్చితమైనవో వారు కనుక్కోవడం జరిగింది. యు.ఎల్.టి అనువాదకులు ఎక్కువగా పండితులు చెప్పే యు.ఎల్.టి పదాల మీద ఆధారపడ్డారు. ఎందుకంటే యు.ఎల్.టి ని ఉపయోగించే వ్యక్తులు ఇతర నకళ్ళపై ఆధారపడి బైబిలు సమాచారాన్ని పొందవచ్చు. ULTని ఉపయోగించే వ్యక్తులు ఇతర కాపీలపై ఆధారపడిన బైబిళ్లకు ప్రాప్యత కలిగి ఉండవచ్చు కాబట్టి, ULT అనువాదకులు కొన్నిసార్లు వాటి మధ్య ఉన్న కొన్ని తేడాల గురించిన సమాచారాన్ని ULT ఫుట్‌నోట్‌లలో లేదా unfoldingWord® Translation Notesలో చేర్చారు.

యు.ఎల్.టి లో చేసినట్లుగా, యు.ఎల్.టి లోని వచనాన్ని అనువదించడానికి పుస్తకం అడుగు భాగాన రాసే వివరాలకు సంబంధించి అదనపు వాక్యాలను వ్రాసే విధంగా అనువాదకులను ప్రోత్సహించడం జరిగింది. ఏదైనా స్థానిక సంఘం వాస్తవంగా ఆ వాక్యాలను ప్రధాన వాక్యంలో చేర్చాలని కోరుకుంటే, అనువాదకులు అలాంటి వచనాలను ఉంచవచ్చు. వాటి గురించి ఒక ఫుట్‌నోట్‌ను చేర్చవచ్చు.

బైబిలు నుండి ఉదాహరణలు

మత్తయి18: 10-11 వవచనాలకు సంబంధించిన 11వ వచనానికి యు.ఎల్.టి లో ఒక ఫుట్‌నోట్ ఉంది.

10ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకోనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. 11 [1]

[1] కొన్ని ప్రాచీనమైన ప్రతుల్లో 11 వ వచనాన్ని సమర్ధించి దానిని మధ్యలో ఉంచారు. ఎందుకంటే మనుష్యకుమారుడు పోగొట్టుకున్న దానిని రక్షించడానికి వచ్చాడు.

యోహాను7:53-8:11 వచనాలు ముఖ్యమైన ప్రాచీన ప్రతులలో లేవు. వీటిని యు.ఎల్.టి లో చేర్చడమైంది, అయితే ఇది ప్రారంభంలోనూ, చివరిలోనూ చదరపు బ్రాకెట్లతో ([]) గుర్తించడం జరిగింది, 11 వ వచనం తరువాత ఒక ఫుట్‌నోట్ ఉంది.

53 [అప్పుడు ప్రతివాడు ఎవరి ఇంటికి వారు వెళ్లారు.… 11 ఆమె, ”లేదు ప్రభువా” అంది. అందుకు యేసు, “నేను కూడా నిన్ను శిక్షింపను; నీవు వెళ్లి ఇక పాపం చేయవద్దు” అని ఆమెతో అన్నాడు.][2]

[2] ముఖ్యమైన కొన్ని ప్రాచీన ప్రతుల్లో యోహాను7: 53-8:11 వచనాలు లేవు.

అనువాదం వ్యూహాలు

ఒక వచనం వైవిధ్యంగా ఉన్నప్పుడు, మీరు యు.ఎల్.టి లేదా మీకు సౌలభ్యంగా ఉన్న మరొక భాషాంతరానికి సంబంధించిన అనువాదాన్ని అనుసరించి దానిని ఎంచుకోవచ్చు.

(1). యు.ఎల్.టి చేసే వచనాలను అనువదించి, యు.ఎల్.టి అందించే విధంగా ఫుట్‌నోట్‌లో చేర్చండి. (2). మరొక అనువాదం చేసిన విధంగా వచనాలను అనువదించండి. దానికి సరిపోయే విధంగా ఫుట్‌నోట్‌ను మార్చండి.

అన్వయించబడిన అనువాదం వ్యూహాలకు ఉదాహరణలు:

అనువాద వ్యూహాలు మార్కు 7:14-16 యు.ఎల్.టి వచనాలకు వినియోగించడం జరిగింది, ఇందులో 16 వ వచనానికి ఫుట్‌నోట్ ఉంది.

14 అప్పుడాయన జనసమూహాన్ని మరల తనయొద్దకు పిలిచి, “మీరందరు నా మాట విని గ్రహించుడి. 15 ఒక మనుషుని వెలుపలినుండి లోపలికి పోయి అతణ్ణి అపవిత్రునిగా చేసేది ఏదీ లేదు గాని, లోపలినుండి బయటకు వచ్చేదే అతణ్ణి అపవిత్రునిగా చేస్తుంది." 16 [1] [1]ముఖ్యమైన ప్రాచీన ప్రతుల నకళ్ళలో 16వ వచనాన్ని వదిలివేశారు. ఎవనికైతే వినడానికి చెవులు ఉంటాయో, అతడు వినును గాక.

(1). యు.ఎల్.టి తర్జుమా చేసే వచనాలను అనువదించండి. యు.ఎల్.టి అందించే ఫుట్‌నోట్‌ను చేర్చండి.

14ఆయన తిరిగి జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి వారితో, “మీరంతా నా మాట విని, అర్ధం చేసుకోండి.15బయట నుండి లోపలికి పోయి ఒకడిని మలినం చేసేది ఏదీ లేదు గాని, లోపల నుంచి బయటకు వచ్చేదే వాడిని మలినపరుస్తుంది."16 [1]

[1] ముఖ్యమైన ప్రాచీన ప్రతుల నకళ్ళలో 16 వ వచనం వదిలేయడం జరిగింది. ఎవరికైన వినడానికి చెవులు ఉంటే, అతణ్ణి విననివ్వండి.

(2). అనువదించాల్సిన వాక్యాలను వేరే విధంగా వాటిని అనువదించండి. దానికి సరిపోయే విధంగా ఫుట్‌నోట్‌ను మార్చండి.

14మళ్ళీ ఆయన జనాన్నిపిలిచి వారితో, "నేను చెప్పేది మీరంతా విని, దానిని అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నది లోపలికెళ్ళితే ఒకడు అపవిత్రుడవ్వడు, లోపల నుండి బయటకొచ్చేదే అతణ్ణి అపవిత్రం చేస్తుంది. 16 ఎవనికైతే వినడానికి చెవులుంటాయో, అతను వినును గాక. " [1]

[1] కొన్ని ప్రాచీన ప్రతుల నకళ్ళలో16వ వచనం లేదు.