te_tw/bible/other/teacher.md

4.1 KiB
Raw Permalink Blame History

బోధకుడు , ఉపదేశకుడు

నిర్వచనం:

బోధకుడు అంటే ఇతరులకు కొత్తసమాచారం అందించే వ్యక్తి. ఉపదేశకులు ఇతరులు పరిజ్ఞానం, నిపుణతలు నేర్చుకునేలా సహాయం చేస్తారు.

  • బైబిల్లో "బోధకుడు " అనే మాటను ప్రత్యేక రీతిలో ఉపయోగిస్తారు. దేవుణ్ణి గురించి బోధించే ఎవరినైనా సూచించడానికి ఈ పదం వాడతారు.
  • బోధకుల నుండి నేర్చుకునే వారిని "విద్యార్థులు” లేక “శిష్యులు" అంటారు.
  • కొన్నిబైబిల్ అనువాదాల్లో ఈ పదాన్ని యేసుకు ప్రత్యేక బిరుదు నామంగా ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • బోధకుడు అనేది సాధారణంగా దీన్ని మత ఉపదేశకుల సంబోధనను అనువదించడంలో ఉపయోగిస్తారు. పాఠశాల అధ్యాపకులకు ఇది వాడరు.
  • కొన్నిసంస్కృతుల్లో దీన్ని ప్రత్యేక బిరుదు నామంగా, ఉదాహరణకు "అయ్యా” లేక “రబ్బీ” లేక “ఉపదేశకా" అని వాడతారు.

(చూడండి: disciple, preach)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __27:1__ఒక రోజు , యూదు చట్టం నిపుణుడు యేసును పరీక్ష చేస్తూ ఇలా అన్నాడు, "బోధకా, నిత్య జీవం వారసత్వముగా పొందడానికి నేనేం చెయ్యాలి?"
  • __28:1__ఒక రోజు ఒక ధనిక యువ అధికారి యేసును ఇలా అడిగాడు, "మంచి బోధకా, నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలి?"
  • __37:2__రెడురోజులు గడిచాక, యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, "మనం తిరిగి యూదయకు వెళ్దాం పదండి." అయితే శిష్యులు ఇలా జవాబిచ్చాడు, " బోధకుడా, కొద్ది రోజుల క్రితమే వారు నిన్ను చంపడానికి చూశారు కదా!"
  • __38:14__యూదా వచ్చి యేసు దగ్గరికి వచ్చి "బోధకా, వందనాలు" అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు.
  • __49:3__యేసు గొప్ప బోధకుడు, ఆయన అధికారంతో మాట్లాడాడు. ఎందుకంటే అయన దేవుని కుమారుడు.

పదం సమాచారం:

  • Strongs: H3384, H3925, G13200, G25670, G35470, G55720