te_tw/bible/other/preach.md

9.6 KiB
Raw Permalink Blame History

బోధించు/ప్రసంగించు, బోధ/ప్రసంగం, బోధకుడు/ప్రసంగి/కుడు, ప్రకటించు, ప్రకటన

నిర్వచనం:

“బోధించు/ప్రసంగించు” అంటే ఒక ప్రజల గుంపుతో మాట్లాడడం, దేవుని గురించి వారికి బోధించడం, ఆయనకు విధేయులవ్వాలని వారిని ప్రేరేపించడం అని అర్థం. “ప్రకటించు” అంటే బహిరంగముగానూ, ధైర్యంగానూ ఒక దానిని చాటించడం లేదా వెల్లడించడం అని అర్థం.

·         తరచుగా ప్రసంగం ఒక పెద్ద జనసమూహమునకు ఒక వ్యక్తి ద్వారా జరిగించబడుతుంది. ఇది సాధారణంగా మాటలలో చెప్పడము, రాయడం కాదు.

·         “ప్రసంగించుట,” “ఉపదేశించడం” అనే పదాలు ఒకేలా ఉంటాయి, అయితే ఖచ్చితంగా ఒకటే కాదు.

·         “ప్రసంగించుట” అనేది ప్రధానంగా ఆత్మీయ లేదా నైతిక సత్యాన్ని బహిరంగంగా ప్రకటించడమును, ప్రేక్షకులు ఆ ప్రకటనకు స్పందించాలని ప్రేరేపించడమును సూచిస్తున్నది. "బోధ" హెచ్చరికను నొక్కి చెప్పే పదం, అంటే ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం లేదా దేనినైనా ఏవిధంగా చేయాలో బోధించడం.

·         “ప్రసంగించుట” అనే పదము సాధారణముగా “సువార్త” అనే పదముతో ఉపయోగించబడుతుంది.

·         ఒక వ్యక్తి ఇతరులకు ప్రసంగించినది సాధారణంగా అతని “బోధనలుగా” కూడా పరిగణించబడుతాయి.

·         తరచుగా బైబిలులో “ప్రకటించడం” అంటే దేవుడు ఆజ్ఞాపించినదానిని బహిరంగముగా చాటించడం అని అర్థం. లేదా దేవుని గురించీ, ఆయన గొప్పతనమును గురించీ ఇతరులకు తెలియచెప్పడం అని అర్థం.

·         క్రొత్త నిబంధనలో అనేకమైన పట్టణాలలోనూ, ప్రాంతాలలోనూ, అనేక ప్రజలకు యేసుని గూర్చిన శుభవార్తను అపొస్తలులు ప్రకటించారు.

·         “ప్రకటించు” అనే పదం రాజుల ద్వారా చేయబడిన ఆదేశాల కోసమూ లేదా బహిరంగ విధానములో చెడును ఖండించడానికీ కూడా ఉపయోగించబడుతుంది.

·         “ప్రకటించు” అనే పదమును అనువదించు ఇతరావిధాలలో  “చాటించడం" లేదా "బహిరంగముగా ప్రసంగిచడము" లేదా "బహిరంగంగా వెల్లడించడం" అనునవి ఉండవచ్చు.

·         “ప్రకటన” అనే పదమును "చాటింపు" లేదా "బహిరంగ ప్రసంగము" అని కూడా అనువదించబచ్చు.

(చూడండి: వెల్లడించు,శుభవార్తయేసుదేవుని రాజ్యము)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

“దేవుని రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందండి” అని అతను (యోహాను) వారికి బోధించాడు/ప్రసంగిచాడు.

  • __30:1__అనేక గ్రామాలలో ప్రజలకు బోధించుటకునూ/ప్రసంగిచుటకునూ, ఉపదేశించుటకునూ యేసు తన శిష్యులను పంపాడు.
  • __38:1__సుమారు ముప్పై సంవత్సరములైన తరువాత యేసు మొట్టమొదటిగా బహిరంగముగా బోధించుటకు/ప్రసగించుటకు మరియు ఉపదేశించుటకూ ఆరంభించాడు. ఈ పస్కా పండుగను యెరూషలేములో మీయందరితో ఆచరించుకోవాలని మరియు అక్కడే నేను మరణించబోవుచున్నాని ఆయన తన శిష్యులతో తన చిత్తాన్ని తెలియ పరచాడు.
  • 45:6

అయితే ఇవన్ని జరుగుచున్నప్పటికిని, వారు వెళ్ళిన ప్రతిచోట యేసును గూర్చి వారు బోధిస్తూ/ప్రసంగిస్తూ వచ్చారు.

  • __45:7__అతడు (ఫిలిప్పు) సమరయకు వెళ్లి యేసును గురించి బోధించాడు/ప్రసంగించాడు, అనేకులు రక్షణ పొందారు.
  • __46:6__ఆ క్షణములోనే, సౌలు దమస్కులోని యూదులకు “యేసే దేవుని కుమారుడు” అని బోధించడం/ప్రసంగించడం ఆరంభించాడు!
  • 46:10

ఆ తరువాత అనేకమైన స్థలములలో యేసుని గూర్చిన శుభవార్త బోధించుటకు/ప్రసంగిచుటకు వారు వారిని పంపారు.

  • __47:14__పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణములకు ప్రయాణము చేసిరి, యేసుని గూర్చిన శుభవార్తను ప్రజలకు బోధిస్తూ/ప్రసంగిస్తూ మరియు ఉపదేశిస్తూ వెళ్ళారు.
  • __50:2__యేసు ఈ భూమి మీద నివసించిన కాలంలో "నా శిష్యులు లోకంలోని ప్రతి స్థలంలోని ప్రజల వద్దకు వెళ్ళి దేవుని రాజ్యమునుగురించిన సువార్తను బోధిస్తారు/ప్రసంగిస్తారు. అప్పుడు అంతము వచ్చును" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs:
  • బోధించు/ప్రసంగించు: H1319, H7121, H7150, G1229, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G4283
  • ప్రకటించు: H1319, H1696, H1697, H2199, H3045, H3745, H4161, H5046, H5608, H6963, H7121, H7440, H8085, G518, G591, G1229, G1861, G2097, G2605, G2782, G2784, G2980, G3142, G4135