te_tw/bible/other/sword.md

5.0 KiB
Raw Permalink Blame History

ఖడ్గము, ఖడ్గవీరులు

నిర్వచనము

ఖడ్గము అనగా కోయుటకు లేక పొడుచుటకు ఉపయోగించే చాలా పదునైన లోహపు కత్తి అని అర్థము. ఈ కత్తిని పట్టుకొనుటకు పిడి ఉండి, పొడవాటి మొనగల  కోయుటకు వీలైన  అతి పదునైన కత్తి. .

  • పురాతన కాలములో ఖడ్గపు కత్తి యొక్క పొడవు దాదాపు 60 నుండి 91 సెంటి మీటర్లు ఉండేది.
  • కొన్ని ఖడ్గములకు ఇరువైపులా పదును పట్టియుందురు, దీనిని “రెండంచుల ఖడ్గము” అని లేక “ఇరువైపుల ఉన్న” ఖడ్గములు అని పిలిచెదరు.
  • యేసు శిష్యులు తమ రక్షణకొరకు కత్తులను కలిగియుండిరి. పేతురు తన కత్తిని తీసి ప్రధాన యాజకుని దాసుడి  చెవిని తెగ నరికెను.
  • బాప్తిస్మము ఇచ్చు యోహాను మరియు అపొస్తలుడైన యాకోబు లిరువురు ఖడ్గముల ద్వారా శిరచ్చేదనము చేయబడిరి.

అనువాదం సలహాలు:

  • ఖడ్గము అనే పదమును దేవుని వాక్యమునకు రూపకంగా ఉపయోగించబడింది. పరిశుద్ధ గ్రంథములోని దేవుని బోధనలు ప్రజల అంతర్గత ఆలోచనలను మరియు వారు తమ పాపములను ఒప్పుకొనుటను ఎత్తి చూపింది. అదే విధముగా, ఖడ్గము చాలా లోతుగా ఖండిస్తోంది మరియు ఎంతో బాధను కలుగిస్తుంది. (చూడండి: రూపకం)
  • దీనిని అనువదించే వేరొక పద్దతి “దేవుని వాక్యము ఒక ఖడ్గము వంటిది  మరియు అది లోతుగా విభజించుచు  పాపాములను బయలుపరచును” అన్న రూపకం. .  .
  • ఈ పదము  కీర్తనల గ్రంధములో వేరొక రూపకంగా ప్రస్తావించబడినది. అదేమనగా ఒక వ్యక్తి యొక్క నాలుక లేక మాటలు ప్రజలను గాయపర్చగలిగే ఓక ఖడ్గముతో పోల్చవబడినవి. దీనిని “నాలుక అనేది ఇతరులను తీవ్రంగా గాయపర్చగలిగే ఒక ఖడ్గము వలే ఉన్నది” అని అనువదించవచ్చు.
  • ఒకవేళ మీ సంస్కృతిలో ఖడ్గము గూర్చి తెలియకపొతే, నరకుటకు లేక పొడుచుటకు ఉపయోగించే అతీ పొడువాటి సాధనపు పేరుతొ ఈ వాక్యమును అనువదించవచ్చు. .
  • ఖడ్గమును “పదునైన సాధనము” అని లేక “పొడువాటి కత్తి” అని కూడా వివరించి చెప్పుదురు. కొన్నిఅనువాదాలు  ఖడ్గము యొక్క చిత్రపటమును కూడా చేర్చియుందురు.

(దీనిని చూడండి: తెలియని వాటిని ఎలా అనువదించాలి.)

(ఈ పదములను కూడా చూడండి: James (brother of Jesus), John (the Baptist), tongue, word of God)

బైబిల్ రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0019, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G31620, G45010