te_tw/bible/other/stiffnecked.md

3.5 KiB

లోబడనొల్లని, మొండి పట్టుదల, మొండితనముగా, మొండితనము

నిర్వచనము:

“లోబడనొల్లని” అనే ఈ మాట ఒక నానుడియైయున్నది, దీనిని పరిశుద్ధ గ్రంథములో దేవునికి అవిధేయత చూపేవారిని మరియు పశ్చాత్తాపపడకుండా ఉండేవారిని సూచించుటకు వాడబడియున్నది. అటువంటి ప్రజలు చాలా అహంకారముగాను మరియు దేవుని అధికారమునకు సమర్పించుకొనకుండా ఉండేవారిగాను ఉందురు.

  • అదేవిధముగా, “మొండి పట్టుదల” అనే ఈ మాట ఎంత బ్రతిమాలికొనిన తన క్రియలను లేక మనస్సును మార్చుకొనని వ్యక్తిని సూచించుచున్నది. మొండి పట్టుదలగల వ్యక్తులు మంచి సలహాలను స్వీకరించరు లేక ఇతర ప్రజలు ఇచ్చేటువంటి హెచ్చరికలు వినడు.
  • పాత నిబంధన ఇశ్రాయేలీయులను “లోబడనొల్లని ప్రజలు” అని తెలియజేయుచున్నది, ఎందుకంటే మీ పాపములను ఒప్పుకొని, యెహోవా వైపుకు తిరుగుడి అని హెచ్చరించిన దేవుని ప్రవక్తల అనేక సందేశాలను వివనివారు.
  • మెడ “బిరుసుగా” ఉంటె, అది అంత సులభముగా వంగదు. ఒక వ్యక్తి తన అలవాట్లను మార్చుకొనుటకు తిరస్కరింఛి “వంగని” వ్యక్తియని చెప్పుటకు అనువాద భాషలో బహుశః వేరే పదము ఉండవచ్చు.
  • ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములలో “గర్వపూరితమైన మొండి పట్టుదల” లేక “అహంకారము మరియు లొంగని తత్వము” లేక “మార్చుకొనుటకు తిరస్కరించుట” అనే మాటలను ఉపయోగంచుదురు.

(ఈ పదములను కూడా చూడండి: అహంకారము, గర్వము, పశ్చాత్తాపపడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H47, H3513, H5637, H6203, H6484, H7185, H7186, H7190, H8307, G483, G4644, G4645