te_tw/bible/other/reproach.md

2.5 KiB

నింద, నిందించును, నిందించబడెను, నిందించబడుట, నిందగా

నిర్వచనము:

ఒకరిని నిందించుట అనగా ఆ వ్యక్తియొక్క ప్రవర్తననుగాని లేక గుణగణములనుగాని విమర్శించుట లేక ఒప్పకొనకపోవుట అని అర్థము. నింద అనునది ఒక వ్యక్తి గూర్చి ప్రతికూల వ్యాఖ్య చేయడమైయుండును.

  • ఒక వ్యక్తి “నిందింపబడలేదు” లేక “నిందకు అతీతముగా ఉన్నాడు” లేక “నిందారహితముగా ఉన్నాడని” చెప్పుట అనగా ఈ వ్యక్తి దేవుని గౌరవించు విధానములో నడుకొనుచున్నాడని మరియు ఆ వ్యక్తిని విమర్శించడానికి ఇసుమంతైనా లేదని చెప్పుటయని దాని అర్థము.
  • “నింద” అనే ఈ పదమును “ఆరోపణ” లేక “సిగ్గుచేటు” లేక “అవమానించుట” అని తర్జుమా చేయవచ్చును.
  • “నింద” అనే ఈ పదమును “గద్దించు” లేక “ఆరోపించు” లేక “విమర్శించు” అని సందర్భానుసారముగా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: ఆరోపించు, గద్దించు, అవమానము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1421, H1442, H2617, H2659, H2778, H2781, H3637, H3639, H7036, G410, G423, G819, G3059, G3679, G3680, G3681, G5195, G5196, G5484