te_tw/bible/other/rebuke.md

2.4 KiB
Raw Permalink Blame History

గద్దించడం, కోపపడడం

నిర్వచనము:

"గద్దించడం" పదం ఒకరిని సాధారణంగా నిష్టూరంగానూ లేదా బలంగానూ నోటిమాటద్వారా సరిచెయ్యడాన్ని సూచిస్తుంది.

  • ఇతర విశ్వాసులు దేవునికి స్పష్టంగా అవిధేయత చూపించినప్పుడు క్రైస్తవులు వారిని గద్దించాలని క్రొత్త నిబంధన ఆజ్ఞాపిస్తుంది.
  • సామెతల గ్రంథం తల్లిదండ్రులు తమ పిల్లలు అవిధేయత చూపించినప్పుడు వారిని గద్దించాలని హెచ్చరిస్తుంది.
  • ఒకమారు తప్పు చేసినప్పుడు వారు తమంతట తాముగా మరింత పాపంలో పాల్గొనకుండా నిలువరించడానికి గద్దింపు ఇవ్వబడుతుంది.
  • ఈ పదం “కఠినంగా సరిచేయడం” లేదా “బుద్ధి చెప్పడం" అని అనువదించబడవచ్చు.
  • “గద్దించడం” పదం “కఠినమైన దిద్దుబాటు" లేదా "బలమైన విమర్శ" అని అనువదించబడవచ్చు.
  • "గద్దింపు లేకుండా" పదం "బుద్ది చెప్పడం లేకుండా" లేదా "విమర్శ లేకుండా" అని అనువదించబడవచ్చు.

(చూడండి:admonish, disobey)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1605, H1606, H2778, H2781, H3198, H4045, H4148, H8156, H8433, G16490, G16510, G19690, G20080, G36790