te_tw/bible/other/reap.md

2.6 KiB

కోయు, కోయును, కోయబడెను, కోసేవాడు, కోతవారు, కోయుట

నిర్వచనం:

“కోయు” అనే ఈ పదమునకు ధాన్యములాంటి పంటలను కోయుట అని అర్థము. “కోయువాడు” అనే ఈ పదము పంటను కోసే ఒక వ్యక్తిని సూచిస్తుంది.

  • సాధారణముగా కోయువారు తమ చేతుల ద్వారా పంటలను కోయుదురు, చెట్లను పెరకుట లేక వాటిని ఏదైనా పదునైన సాధనముతో కత్తరించుదురు.
  • పంటను కోసే ఆలోచన అనేకమార్లు యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రజలకు తెలియజేయుటయు మరియు వారిని దేవుని కుటుంబములోనికి తీసుకోని వచ్చుటయును సూచించును.
  • “మనుష్యుడు ఏది విత్తునో దానిని కోయును” అనే ఈ మాటలో ఉన్నట్లుగా, ఒక వ్యక్తి క్రియలనుండి వచ్చిన పరిణామాలను సూచించుటకు ఈ పదమును అలంకారికముగా కూడా ఉపయోగించడమైనది.
  • “కోయు” మరియు “కోయువాడు” అనే ఈ పదములను అనువాదము చేయు ఇతర విధానములలో “కోత” మరియు “కోత కోయువాడు” (లేక “కోత కోయు వ్యక్తి) అని కూడా చేర్చుదురు.

(ఈ పదములను కూడా చూడండి: శుభవార్త, కోత)

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

పదం సమాచారం:

  • Strong's: H4672, H7114, H7938, G270, G2325, G2327