te_tw/bible/other/precious.md

2.7 KiB
Raw Permalink Blame History

అమూల్యమైన, విలువగల, ఖరీదైన, నాణ్యమైన

వాస్తవాలు:

“అమూల్యమైన” అనే పదము చాలా విలువైనవిగా పరిగణించే వస్తువులను లేదా విలువైనవారిగా పరిగణించే ప్రజలను వివరిస్తుంది.

  • “అమూల్యమైన రాళ్లు” లేదా "అమూల్యమైన ఆభరణాలు" అనే పదం రంగురంగుల లేదా వాటిని అందంగా లేదా ఉపయోగకరంగా చేసే ఇతర లక్షణాలను కలిగి ఉన్న రాళ్ళు మరియు ఖనిజాలను సూచిస్తుంది.
  • అమూల్యమైన రాళ్ళకు ఉదాహరణగా వజ్రాలు, కెంపులు, మరియు పచ్చలు ఉంటాయి.
  • బంగారము మరియు వెండి అనే వాటిని “అమూల్యమైన లోహాలు” అని పిలుస్తారు.
  • యెహోవ ప్రజలు ఆయన దృష్టిలో “అమూల్యమైనవారు” అని ఆయన చెపుతున్నాడు (యెషయా.43:4).
  • సాధువైనట్టియు, మృదువైనట్టియునైన ఆత్మ దేవుని దృష్టిలో అమూల్యమైనది అని పేతురు రాసాడు. (1 పేతురు 3:4).
  • ఈ పదము “విలువైనది” లేదా “ఎంతో ప్రీతికరమైనది” లేదా “ప్రేమతో ఉంచుకొనదగినది” లేదా “అతీ ఎక్కువ విలువైనది” అని కూడా అనువదించబడవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: బంగారము, వెండి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0068, H1431, H2532, H2667, H2896, H3357, H3365, H3366, H3368, H4022, H4030, H4261, H4262, H5238, H8443, G09270, G17840, G24720, G41850, G41860, G50920, G50930